eshachalam forest
-
శేషాచలం అడవుల్లో మళ్లీ మంటలు
చిత్తూరు : శేషాచలం అడవుల్లో మళ్లీ మంటలు చెలరేగాయి. పాపవినాశనం వైపు మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. కోరుట్ల అటవీ ప్రాంతంతో పాటు కాకులకొండల్లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. వేలాది ఎకరాల్లో అడవీ సంపద దగ్దం అవుతోంది. అగ్నిమాపక సిబ్బంది, అటవీశాఖ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు టీటీడీ సిబ్బంది కూడా ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. కాగా మంటలు భారీగా వ్యాపిస్తుండటంతో పాపవినాశనం వెళ్లే వాహనాలను నిలిపివేశారు. -
శేషాచలంలోఅదుపులోకి వచ్చిన మంటలు
తిరుమల : తిరుమల శేషాచలంలో మంటలు ఎట్టకేలకు బుధవారం ఉదయానికి అదుపులోకి వచ్చాయి. తిరుమలకు సమీప ప్రాంతంలోని పారువేట మండపం, కాకులకొండ, పాపవినాశనం, మొదటి ఘాట్‌రోడ్డులో సుమారు 10 కిలోమీటర్ల విస్తీర్ణంలోని దట్టమైన అడవి అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. భారీ వృక్షాలు బూడిదయ్యాయి. నాలుగురోజులుగా పారువేట మండపం ప్రాంతంలో మంటలు చెలరేగుతున్నాయి. అటవీశాఖ సిబ్బందితో పాటు, అగ్నిమాపక సిబ్బంది సుమారు రెండు రోజులు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. మంగళవారం తిరుమల శేషాచల అడవిలోని పారువేట మండపం ప్రాంతంలో మంటలు తిరిగి పెద్ద ఎత్తున మొదలయ్యాయి. అక్కడినుంచి పక్కనే ఉన్న శ్రీగంధం వనం వరకు మంటలు వ్యాపించాయి. పారువేట మండపం తూర్పుదిశలోని కాకుల కొండ వద్దనున్న టీటీడీ పవన విద్యుత్ ప్లాంటుకు కూడా మంటలు విస్తరించాయి. దీనిని ముందే ఊహించిన టీటీడీ అటవీ విభాగం విద్యుత్ ప్లాంట్ల వద్ద ఫైరింజన్‌ను సిద్ధంగా ఉంచుకుని మంటలు చెలరేగకుండా అడ్డుకున్నారు. -
శేషాచలం అడవుల్లో భారీ అగ్నిప్రమాదం
తిరుపతి : తిరుమల శేషాచలం అడవుల్లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అన్నమయ్య కాలిబాటలో మంటలు ఎగసిపడుతున్నాయి. కొండల్లోని వందల ఎకరాల్లో అడవులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖతో పాటు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి దట్టమైన కమ్ముకోవడంతో పచ్చని అటవీ ప్రాంతానికి భారీ నష్టం వాటిల్లింది. కాగా ఎర్ర చందనం స్మగ్లర్లు అడవికి నిప్పు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆకతాయిల చర్యా,లేక ప్రమాదవశాత్తూ ప్రమాదం జరిగిందా అనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు.