తిరుమల : తిరుమల శేషాచలంలో మంటలు ఎట్టకేలకు బుధవారం ఉదయానికి అదుపులోకి వచ్చాయి. తిరుమలకు సమీప ప్రాంతంలోని పారువేట మండపం, కాకులకొండ, పాపవినాశనం, మొదటి ఘాట్‌రోడ్డులో సుమారు 10 కిలోమీటర్ల విస్తీర్ణంలోని దట్టమైన అడవి అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. భారీ వృక్షాలు బూడిదయ్యాయి. నాలుగురోజులుగా పారువేట మండపం ప్రాంతంలో మంటలు చెలరేగుతున్నాయి. అటవీశాఖ సిబ్బందితో పాటు, అగ్నిమాపక సిబ్బంది సుమారు రెండు రోజులు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
మంగళవారం తిరుమల శేషాచల అడవిలోని పారువేట మండపం ప్రాంతంలో మంటలు తిరిగి పెద్ద ఎత్తున మొదలయ్యాయి. అక్కడినుంచి పక్కనే ఉన్న శ్రీగంధం వనం వరకు మంటలు వ్యాపించాయి. పారువేట మండపం తూర్పుదిశలోని కాకుల కొండ వద్దనున్న టీటీడీ పవన విద్యుత్ ప్లాంటుకు కూడా మంటలు విస్తరించాయి. దీనిని ముందే ఊహించిన టీటీడీ అటవీ విభాగం విద్యుత్ ప్లాంట్ల వద్ద ఫైరింజన్‌ను సిద్ధంగా ఉంచుకుని మంటలు చెలరేగకుండా అడ్డుకున్నారు.
శేషాచలంలోఅదుపులోకి వచ్చిన మంటలు
Published Wed, Mar 19 2014 9:14 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement