
శేషాచలం అడవుల్లో భారీ అగ్నిప్రమాదం
తిరుపతి : తిరుమల శేషాచలం అడవుల్లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అన్నమయ్య కాలిబాటలో మంటలు ఎగసిపడుతున్నాయి. కొండల్లోని వందల ఎకరాల్లో అడవులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖతో పాటు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు.
పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి దట్టమైన కమ్ముకోవడంతో పచ్చని అటవీ ప్రాంతానికి భారీ నష్టం వాటిల్లింది. కాగా ఎర్ర చందనం స్మగ్లర్లు అడవికి నిప్పు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆకతాయిల చర్యా,లేక ప్రమాదవశాత్తూ ప్రమాదం జరిగిందా అనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు.