
సాక్షి, చిత్తూరు: లాక్‌డౌన్ కారణంగా జనాలందరూ ఇళ్లకే పరిమితం కావడంతో వన్యప్రాణులు యదేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నాయి. అయితే చాలా కాలం తరువాత కేంద్రప్రభుత్వం కొన్ని సవరణలు ఇవ్వడంతో మళ్లీ మూతబడ్డ షాపులు తెరుచుకుంటున్నాయి. తిరుమల పాపవినాశనంలోని ఒక దుకాణాన్ని 60 రోజులు తరువాత తెరిచారు. షాపు తెరిచిన వెంటనే ఒక కొండచిలువ కనిపించడంతో షాప్ యజమాని షాక్‌కు గురయ్యారు. దుకాణ యజమాని షాపుకు ఉన్న పట్టను తొలగించగా భారీ కొండ చిలువ దర్శనమిచ్చింది. లాక్‌డౌన్ కారణంగా 60 రోజులుగా మూతబడిన అంగళ్లను పరిశీలించడానికి యజమానులు గురువారం షాపుల వద్దకు వెళ్లారు. రెండు నెలలకు పైగా జనసంచారం లేకపోవడంతో దుకాణాల్లోనే పాములు సేద తీరుతున్నాయి. దీంతో యజమానులు భయభ్రాంతులకు గురవుతున్నారు. (వైఎస్ జయంతి రోజున ఇళ్ల పట్టాల పంపిణీ)