ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ | Rakul Preet Singh Consider for Vijay Tupaki | Sakshi
Sakshi News home page

ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్

Published Sat, Nov 12 2016 3:09 PM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM

ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్

ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్

ప్రస్తుతం టాలీవుడ్లో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది ఈ బ్యూటి. ప్రస్తుతం రాంచరణ్ హీరోగా తెరకెక్కుతున్న ధృవ సినిమాతో పాటు మురుగదాస్ మహేష్ బాబుల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ హీరోయిన్గా నటిస్తోంది. అయితే మహేష్ సినిమా షూటింగ్ సందర్భంగా మురుగదాస్ చెప్పిన విషయం రకుల్ ను షాక్ కు గురిచేసిందట.

మురుగదాస్ గతంలోనే తన సినిమాకు రకుల్ హీరోయిన్గా తీసుకోవాలని భావించాడట. అప్పట్లో రకుల్ చేసిన ఓ టివి కమర్షియల్ చూసిన మురుగ, తనను తుపాకీ సినిమాకు హీరోయిన్గా తీసుకోవాలని భావించాడు. అయితే రకుల్ కాంటాక్ట్ కోసం ఆ యాడ్ ఏజెన్సీని సంప్రదించగా, వారు ఆమెకు సినిమాల్లో చేసే ఇంట్రస్ట్ లేదని చెప్పారట. దీంతో తన ఆలోచనను విరమించుకొని కాజల్ను హీరోయిన్గా తీసుకున్నాడు మురుగదాస్. ఈ విషయం తెలిసిన రకుల్ ఇప్పుడు బాధపడిపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement