అవేవీ నన్ను బాధించవు | She does not suffer with failures | Sakshi
Sakshi News home page

అవేవీ నన్ను బాధించవు

Published Sat, Dec 14 2013 1:44 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

అవేవీ నన్ను బాధించవు - Sakshi

అవేవీ నన్ను బాధించవు

విజయాలు పారితోషికాన్ని పెంచుతాయి. ప్లాప్స్ అవకాశాల్ని దూరం చేస్తాయి. సక్సెస్‌ను ఆస్వాదించే వారు ప్లాప్‌లను భరించలేరు. ప్రస్తుతం నటి కాజల్ అగర్వాల్ ఈ పరిస్థితిలోనే ఉందట. ఈ బ్యూటీకి తొలుత కోలీవుడ్‌లో విజయం దోబూచులాడింది. టాలీవుడ్ ఆదుకుంది. మగధీర చిత్రం ఆమె ఊహించనంతగా అందలమెక్కించింది. బృందావనం, బిజినెస్‌మెన్ వంటి చిత్రాల ఘన విజయంతో కాజల్ క్రేజీ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. తుపాకీ చిత్రంతో తమిళంలోనూ హిట్ కథానాయికల కోవలో చేరిపోయింది. ప్రస్తుతం అవకాశాల వెంట పరిగెత్తాల్సిన పరిస్థితి.

ఇటీవల ఈ బ్యూటీ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇది ఆమెను కలవరపెట్టే విషయం.  కాజల్ మాత్రం అపజయాలు తనను బాధించలేవని బింకాలు పోతోంది. సినిమా పరిశ్రమలో జయాపజయాలు సాధారణమని, సక్సెస్‌కు పొంగిపోవడం, ప్లాప్‌లకు కుంగిపోవడం ఉండదని అం టోంది. ఒక పక్క ఈ భామకు ఇంటిలో వరుడి వేటలో ఉన్నారట. కాజల్ మాత్రం సంక్రాంతికి విడుదల కానున్న జిల్లా చిత్ర విజయం కోసం ఎదురు చూస్తున్నానంటోంది. మరి జిల్లా ఆమెకు మళ్లీ పూర్వ వైభవాన్ని తెస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement