మహేష్ మూవీ సీక్వలా..? | Mahesh and Murugadoss Movie is Tupaki Sequel | Sakshi
Sakshi News home page

మహేష్ మూవీ సీక్వలా..?

Published Tue, Dec 13 2016 12:18 PM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM

మహేష్ మూవీ సీక్వలా..?

మహేష్ మూవీ సీక్వలా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా తమిళ నటుడు దర్శకుడు ఎస్ జె సూర్య ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు.

తాజాగా ఈ సినిమాకు సంబందించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. మహేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. గతంలో విజయ్ హీరోగా నటించిన తుపాకి సినిమాకు సీక్వల్ అన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తమిళనాట ఈ ప్రచారం జోరుగా జరుగుతోంది. మరి ఈ ప్రచారం నిజమో కాదో తెలియాలంటే మాత్రం యూనిట్ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement