'అనంత' రైల్వే స్టేషన్ లో తుపాకీల కలకలం | pistol found in anantapur railway station | Sakshi
Sakshi News home page

'అనంత' రైల్వే స్టేషన్ లో తుపాకీల కలకలం

Published Wed, Aug 12 2015 2:04 PM | Last Updated on Fri, Jun 1 2018 9:02 PM

అనంతపురం రైల్వే స్టేషన్ సమీపంలో తుపాకులతో సంచరిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు బుధవారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు.

అనంతపురం: అనంతపురం రైల్వే స్టేషన్ సమీపంలో తుపాకులతో సంచరిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు బుధవారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. రైలులో వెళ్లేందుకు వారు స్టేషన్‌కు రాగా పక్కా సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరంకు చెందిన పుల్లారెడ్డి, రామగిరి మండలం పిచ్చిరెడ్డికోటకు చెందిన కె.భాస్కరాచారి, ఇదే మండలం కొత్తగాదెకుంటకు చెందిన డి.సూర్యనారాయణ, ఉరవకొండ మండలం పెద్దమస్తూరు గ్రామానికి చెందిన కె.కుమార్ అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. కర్ణాటకలోని బళ్లారిలో తుపాకులను కొనుగోలు చేసినట్టు విచారణలో వెల్లడైంది. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement