తుపాకి రాముడు కోదండం మల్లయ్య
కోరుట్ల: ‘మాకేం తక్కువ లేదు..సార్. రేపు పొద్దుగాల నిజాం రాజుకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన. మా సిపాయిలు మధ్యాహ్నం అమెరికాకు విమానం బుక్ చేసిండ్రు. అట్నుంచి అటే ఎళ్లిపోవాలా. రాత్రి అక్కడే డిన్నర్ చేసి, మళ్లీ లండన్‌కు బిజినెస్ పని మాట్లాడుకుని వచ్చేస్తా. ఏదో మీరు కనపడ్డరని అడగకపోతే ఏమన్న అనుకుంటరని కొన్ని డబ్బులు అడుగుతున్న.
కానీ.. మాకే మస్తు మాన్యాలు ఉన్నయి..’ అంటూ కడుపుబ్బ నవ్వించే తుపాకి రాముని మాటల గారడీ మూగబోయింది. సుమారు యాభై ఏళ్ల పాటు కోరుట్ల, మెటపల్లి, జగిత్యాల పరిసర ప్రాంతాల్లో తుపాకి రామునిగా పేరుపొందిన కళాకారుడు కోదండం మల్లయ్య(73) సోమవారం మృతిచెందాడు. కోరుట్లలోని అల్లమయ్యగుట్టకాలనీలో నివసించే మల్లయ్య తరతరాలుగా వస్తున్న తుపాకి రాముని కళను నమ్ముకుని జీవించాడు.
ఖాకీ డ్రస్సు, టోపీ, కట్టె తుపాకీతో విచిత్ర వేషధారణలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. మల్లయ్య మృతిచెందాని తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ శీలం వేణు, టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, టీఆర్‌ఎస్ నాయకులు జక్కుల జగదీశ్వర్, కస్తూరి లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు ఇందూరి సత్యం, గజెల్లి రాజేంద్రప్రసాద్‌లు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment