అంజలి సినిమాలో కాజల్ స్పెషల్ సాంగ్? | Kajal Agarwal to turn item girl? | Sakshi
Sakshi News home page

అంజలి సినిమాలో కాజల్ స్పెషల్ సాంగ్?

Published Tue, Jul 8 2014 5:02 PM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

అంజలి సినిమాలో కాజల్ స్పెషల్ సాంగ్?

అంజలి సినిమాలో కాజల్ స్పెషల్ సాంగ్?

అగ్ర కథానాయికలు ఐటెం పాటల్లో నర్తించే సంప్రదాయం బాలీవుడ్ లో మొదలయి టాలీవుడ్ కు పాకింది. తెలుగు తెరపై టాప్ స్టార్స్ గా వెలుగొందున్న హీరోయిన్లు ఇప్పుడు ప్రత్యేక గీతాల్లో పాదం కదుపుతున్నారు. 'అల్లుడు శ్రీను'లో తమన్నా, 'ఆగడు'లో శృతి హాసన్ ప్రత్యేక పాటల్లో నటించారు.

'చందమామ' భామ కాజల్ అగర్వాల్ కూడా ఐటెం సాంగ్ కు సిద్దమవుతోందని సినిమా వర్గాలంటున్నాయి. అంజలి హీరోయిన్ గా నటించిన గీతాంజలి సినిమాలో ఆమెతో స్పెషల్ సాంగ్ చేయించాలని భావించిన నిర్మాతలు కాజల్ ను సంప్రదించారని చెప్పుకుంటున్నారు. అయితే నిర్మాతలు ఊహించిన దానికంటే ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని అంటున్నారు.

మొదట ఈ పాట కోసం సమంతను సంప్రదించారని రూమర్లు వచ్చాయి. ప్రస్తుతం 'గోవిందుడు అందరి వాడేలే' సినిమాలో రామ్చరణ్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె స్పెషల్ సాంగ్ చేస్తుందో, లేదో త్వరలోనే తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement