1. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘చెలియా’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఈ హైదరాబాదీ అమ్మాయి ఎవరో తెలుసా?
ఎ) అదితీ రావు హైదరీ బి) కలర్స్ స్వాతి సి) అంజలి డి) బిందు మాధవి
2. ‘మోసగాడు’ చిత్రంలో హీరోయిన్ శ్రీదేవి ద్విపాత్రాభినయం చేసారు. శోభన్‌బాబు హీరోగా నటించారు. అందులో విలన్‌గా నటించిన ఆర్టిస్ట్ తర్వాతి కాలంలో శ్రీదేవి సరసన హీరోగా నటించారు. ఎవరా హీరో?
ఎ) మోహన్‌బాబు బి) చిరంజీవి సి) రాజేంద్రప్రసాద్ డి) కృష్ణ
3. రజనీకాంత్ నటించిన ‘లింగా’ సినిమాలో హీరోయిన్‌గా నటించి, మార్కులు కొట్టేసిన బాలీవుడ్ బ్యూటీ ఎవరో కనుక్కోండి?
ఎ) సోనాక్షి సిన్హా బి) దీపికా పదుకోన్ సి) ఐశ్వర్యా రాయ్ డి) అమీ జాక్సన్
4. ‘యాక్షన్ జాక్సన్’ అనే బాలీవుడ్ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. అందులో ఓ సాంగ్‌లో టాలీవుడ్ టాప్ స్టార్ స్టెప్పులేశారు. ఎవరా హీరో?
ఎ) ప్రభాస్ బి) వెంకటేశ్ సి) రానా డి) నానీ
5. ‘అనసూయ రామలింగం’ అనే పాత్రలో నటించిన నటి ఎవరో గుర్తు తెచ్చుకోండి? (చిన్న క్లూ.. ఈ సినిమాలో హీరో నితిన్)
ఎ) కాజల్ అగర్వాల్ బి) సమంతా అక్కినేని సి) శ్రుతీహాసన్ డి) అనుపమ పరమేశ్వరన్
6. దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తన కెరీర్‌లో మొత్తం ఐదు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన ఐదు సినిమాల్లోనూ నటించిన ఒకే ఒక్క ఆర్టిస్ట్ ఎవరో కనుక్కోండి?
ఎ) జయసుధ బి) అలీ సి) ప్రభు డి) ప్రకాశ్‌రాజ్
7. ‘రేసుగుర్రం’ చిత్రంలో ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ అంటూ ‘కిల్‌బిల్‌పాండే’ పాత్రలో కామెడీ పండించిన నటుడెవరో చెప్పండి?
ఎ) తనికెళ్ల భరణి బి) బ్రహ్మానందం సి) శ్రీనివాస రెడ్డి డి) పోసాని కృష్ణమురళి
8 రాజీవ్ కనకాల అనగానే ఈ హీరోకు చాలా క్లోజ్ అని అందరూ అనుకుంటారు. ఏ హీరోకు ఈయన క్లోజ్?
ఎ) ఎన్టీఆర్ బి) అల్లు అర్జున్ సి) సిద్ధార్థ్ డి) రామ్ చరణ్
9. 2008లో జరిగిన ‘ఫెమీనా మిస్ ఇండియా’ పోటీల్లో ‘మిస్ ఫ్రెష్ ఫేస్’, ‘మిస్ బ్యూటీఫుల్ స్కిన్’ రెండు అవార్డులను సొంతం చేసుకున్న బ్యూటీ ఎవరో కనుక్కోండి?
ఎ) జెనీలియా బి) తాప్సీ సి) యామీ గౌతమ్ డి) చార్మీ
10. ‘పెట్ర తాయ్’ అనే తమిళ సినిమా కోసం సింగర్ ఏ.యం.రాజాతో పాటు అదే సినిమా తెలుగు వెర్షన్ ‘కన్నతల్లి’ కోసం సింగర్ ఘంటసాలతో డ్యూయట్ ద్వారా అరంగేట్రం చేసిన పాపులర్ సింగర్ ఎవరో తెలుసా?
ఎ) యస్.జానకి బి) పి. సుశీల సి) జిక్కీ డి) రావు బాలసరస్వతి
11. తెలంగాణలోని యాదగిరి గుట్ట నరసింహ స్వామి టెంపుల్ పునరుద్ధరణకు ప్రభుత్వం ఓ తెలుగు సినిమా ఆర్ట్ డైరెక్టర్‌ను నియమించింది. ఆయనెవరు?
ఎ) తోట తరణి బి) ఆనంద్ సాయి సి) ఏయస్. ప్రకాశ్ డి) చంటి అడ్డాల
12. ‘శంభో శంకర’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్న కమెడియన్ ఎవరో తెలుసా?
ఎ) ధన్‌రాజ్ బి) ‘వెన్నెల’ కిశోర్ సి) సప్తగిరి డి) ‘షకలక’ శంకర్
13. హీరో నాని నటించిన ‘స్నేహితుడా’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిందెవరో గుర్తుందా?
ఎ) కలర్స్ స్వాతి బి) మాధవీ లత సి) వేద డి) మధు శాలిని
14. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రదీప్ రావత్‌ను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడెవరో తెలుసా?
ఎ) వీవీ వినాయక్ బి) బోయపాటి శ్రీను సి) పూరి జగన్నాథ్ డి) ఎస్.ఎస్. రాజమౌళి
15 ‘బళ్లారి బావ...’ అంటూ రానాతో కలిసి ఓ స్టార్ హీరో చిందేశారు. ఆయన ఎవరు?
ఎ) వెంకటేశ్ బి) నాగార్జున సి) నాగచైతన్య డి) అఖిల్
16. ‘‘వియ్ ఆర్ లివింగ్ ఇన్ సొసైటీ. ప్రతి ఒక్కరికీ భయం, బాధ్యత ఉండాలి..’’ అనే డైలాగ్‌ను రాసిందెవరో తెలుసా?
ఎ) కొరటాల శివ బి) అబ్బూరి రవి సి) కోన వెంకట్ డి) అనిల్ రావిపూడి
17. అఖిల్ హీరోగా వస్తున్న మూడో చిత్రానికి దర్శకుడెవరో కనుక్కోండి?
ఎ) వెంకీ కుడుముల బి) సుధీర్ వర్మ సి) వెంకీ అట్లూరి డి) విక్రమ్ కుమార్
18. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘సవ్యసాచి’ చిత్రానికి దర్శకుడెవరో తెలుసా?
ఎ) చందు మొండేటి బి) సందీప్ రెడ్డి సి) మారుతి డి) మíహీ వి.రాఘవ్
19. ఈ ఫొటోలోని హీరోయిన్ ఓ తమిళ హీరో భార్య. ఎవరా హీరోయిన్?
ఎ) విజయ్ బి) సూర్య సి) అజిత్ డి) ధనుష్
20. ఈ పక్కనున్న ఫొటోలోని హీరోయిన్ ఎవరో చెప్పండి?
ఎ) స్నేహా ఉల్లాల్ బి) కత్రినాకైఫ్ సి) సోహా అలీఖాన్ డి) ఆలియా భట్
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు
1) ఎ 2) బి 3) ఎ 4) ఎ 5) బి 6) డి 7) బి 8) ఎ 9) బి 10) బి 11) బి
12) డి 13) బి 14) డి 15) ఎ 16) ఎ17) సి 18) ఎ19) సి 20) బి
నిర్వహణ: శివ మల్లాల
Comments
Please login to add a commentAdd a comment