బాలీవుడ్‌లో భారీ చిత్రాలకు కేరాఫ్ సంజయ్ లీలా భన్సాలీ. ఆయన సినిమాలన్నీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కినవే. ఎంత భారీగా ఖర్చు చేస్తాడో అంతకు మించిన కలెక్షన్స్‌ను రాబడతాడు. అందుకు ఆయన తెరెక్కించిన ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ చిత్రాలే నిదర్శనం.
తాజాగా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘హీరామండి’. ప్రముఖ ఓటీటీ సంస్థ నెటిఫిక్స్‌లో ఈ భారీ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో ఈ వెబ్ సిరీస్‌ని తెరకెక్కించాడు భన్సాలీ. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల లాంటి భారీ తారాగణంతో పిరియాడిక్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్‌ని రూపొందించాడు.
(చదవండి: 'హీరామండి' వెబ్ సిరీస్ రివ్యూ)
స్వాతంత్య్రానికి పూర్వం ‘హీరామండి’ వేశ్యా వాటికలో చోటు చేసుకున్న పలు సంఘటనల ఆధారంగా తెరక్కించిన ఈ వెబ్ సీరిస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకెళ్తోంది. భన్సాలీ మేకింగ్‌పై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సిరీస్ కోసం భన్సాలీ చాలా కాలంపాటు కష్టపడ్డారు. అందుకు తగ్గట్టే నెట్‌ఫ్లిక్స్ భారీ రెమ్యునేరేషన్ ఇచ్చిందట.
ఈ వెబ్ సిరీస్ కోసం భన్సాలీ దాదాపు రూ. 70 కోట్ల వరకు పారితోషికంగా తీసుకున్నట్లు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. అలాగే ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన ఆరుగురు హీరోయిన్లకు కూడా భారీగానే రెమ్యునరేషన్ అందింట. ఈ సిరీస్‌లో ఫరిదాన్ పాత్రను పోషించిన సోనాక్షి సిన్హాకు అత్యధికంగా రూ. 2 కోట్ల పారితోషికంగా అప్పగించిందట నెట్‌ఫిక్స్.
అలాగే మల్లికా జాన్ పాత్రలో నటించిన మనిషా కొయిరాలాకి కోటి రూపాయలను రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో మరో కీలక పాత్రను అదితిరావు హైదరి పోషించింది. ఇందుకుగాను ఆమె రూ. కోటిన్నర వరకు తీసుకుందట. అలాగే లజ్జోగా నటించిన రిచా చంద్దా రూ. 1 కోటి, వహిదాగా నటించిన సంజీదా షేక్ రూ. 40 లక్షలు, ఆలంజేబుగా నటించిన షర్మిన్ సెగల్ రూ. 35 లక్షలు పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment