Fashion: Indian Women Celebrities Beautiful Looks In Cannes 2022- Sakshi
Sakshi News home page

Cannes 2022 Look: కాన్స్‌.. మన తారల లుక్‌ అదుర్స్‌! డ్రెస్‌ ఎంపికలోనే అంతా!

May 27 2022 5:02 PM | Updated on May 27 2022 6:55 PM

Fashion: Indian Women Celebrities Beautiful Look In Cannes 2022 - Sakshi

ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకునే వేదిక అది.. అందం, హుందాతనం కలిసి నడిచే కార్పెట్‌ అది. అందరి చూపులను తమ వైపు పడేలా చేయాలంటే అందుకు తగిన డ్రెస్‌ ఎంపిక ఎంతో ప్రత్యేకంగా ఉండాలి. సమయం, సందర్భం, సీజన్‌... ఇలా వేడుకకు తగిన నియమాలనూ పాటించాలి. ఇవన్నీ మన కళ్లకు కడుతుంది కాన్స్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌. రెడ్‌ కార్పెట్‌పైన మన తారలు వెదజల్లిన జిలుగులు ఇవి..

దీపికా పదుకోన్‌
సబ్యసాచి డిజైనర్‌ శారీ ధరించిన దీపిక రెడ్‌కార్పెట్‌పై హుందాతనాన్ని ప్రదర్శించింది. ఈ ఫిల్మోత్సవంలో దీపికా పదుకోన్‌ తన ఫ్యాషన్‌ పరంపరను కొనసాగించింది. లేత అకుపచ్చ రంగులో ఉన్న గౌన్‌ నిండా పింక్‌ గులాబీలు, ఆకులతో ఆమె నవ్వులతో పోటీపడుతున్నట్టుగా ఉన్నాయి. మ్యాచింగ్‌ బూట్లు మరింత ఆకర్షణీయంగా అమరాయి.

ఐశ్వర్యా బచ్చన్‌
ఇటాలియన్‌ లగ్జరీ ఫ్యాషన్‌ హౌజ్‌ ‘డోల్స్‌ అండ్‌ గబ్బానా’ డిజైనర్‌ బ్లాక్‌ శాటిన్‌ గౌన్‌ను ధరించింది ఐశ్వర్యాబచ్చన్‌. అంచు భాగం వెడల్పాటి ఫ్లేర్‌తో, అందమైన పువ్వులతో డిజైన్‌ చేసిన ఈ గౌన్‌ విశేషంగా ఆకట్టుకుంది. వెస్ట్రన్‌ పార్టీలో ఫ్లోరల్స్‌కున్న ఘనతను ఇలా చాటింది. 

పూజా హెగ్డే
లెబనీస్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ మైసన్‌ గేయన్నా బాల్‌ గౌన్‌తో కాన్స్‌లో సందడి చేసింది పూజా హెగ్డే.  ఫెదర్‌ డిజైన్‌ ఈ గౌన్‌ ప్రత్యేకతను మరింత పెంచింది. పొనీటెయిల్, లాంగ్‌ హ్యాంగింగ్స్‌తో  సింపుల్‌ అనిపించే ఆహార్యంతో ఆకట్టుకుంది పూజా.

తమన్నా 
డిజైనర్స్‌ గౌరీ అండ్‌ నైనిక రూపొందించిన గౌనులో తమన్నా రెడ్‌ కార్పెట్‌పైన సందడి చేసింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాంబినేషన్‌లో శాటిన్‌ నెక్‌లైన్‌తో తన రూపాన్ని మరింతగా హైలైట్‌ చేసింది. 

నర్గిస్‌ ఫక్రీ
టర్కీ డిజైనర్‌ నెడ్రెట్‌ టాసిరోగ్లు రూపొందించిన బేబీ పింక్‌ కలర్‌ షిమ్మర్‌ డ్రెస్‌లో రెడ్‌ కార్పెట్‌పైన నడిచింది నర్గీస్‌ ఫక్రీ. హాల్టర్‌ నెక్‌ ఈ డ్రెస్‌ ప్రత్యేకత. నడుము వరకు సరైన ఫిటింగ్‌తో ఉన్న గౌన్‌ కింది భాగమంతా వెడల్పాటి ఫ్లెయర్‌తో ఆకట్టుకుంది. 

అదితీరావు హైదరీ
ఇండియన్‌ డిజైనర్‌ సబ్యసాచి డిజైన్‌ చేసిన స్లీవ్డ్‌ బ్లాక్‌ గౌన్‌ను ధరించి ఫిల్మోత్సవంలో పాల్గొంది అదితీరావు హైదరీ. ఫ్లోరల్‌ లేస్, క్రూ నెక్, ఎంబ్రాయిడరీ ఈ డ్రెస్‌ ప్రత్యేకతలు. అంతేకాదు గౌన్‌ హైలైట్‌ అయ్యేలా డిజైనర్‌ బ్రాండ్‌ బెల్ట్, రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ గోల్డ్‌ యాక్ససరీస్‌.. కార్పెట్‌పైన స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి.

ఊర్వశి రౌతేలా 
టోనీ వార్డ్‌ కోచర్‌ నుండి తీసుకున్న తెల్లటి రఫుల్డ్‌ గౌన్‌లో రెడ్‌ కార్పెట్‌ మీద మెరిసింది ఊర్వశి రౌతేలా. రఫుల్స్‌తో విప్పారినట్టుగా ఉన్న గౌన్‌ను నడుము, భుజం వద్ద జత కలిపిన డిజైన్‌ డ్రెస్‌కి మరింత అందాన్నిచ్చింది.

చదవండి👉🏾 Catherine Tresa: ఈ హీరోయిన్‌ ధరించిన అంగ్రఖా కుర్తా ధర 32వేలు! డ్రెస్‌ ప్రత్యేకత ఇదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement