ఐశ్వర్యనే ఆదర్శం అంటున్న మామ్‌ దీపికా! | Parenting Style Aishwarya Rai liked Deepika Padukone no Nanny For Her Daughter | Sakshi
Sakshi News home page

ఐశ్వర్యనే ఆదర్శం అంటున్న మామ్‌ దీపికా!

Published Sat, Sep 14 2024 12:48 PM | Last Updated on Sat, Sep 14 2024 1:31 PM

Parenting Style Aishwarya Rai liked Deepika Padukone no Nanny For Her Daughter

బాలీవుడ్‌ స్వీట్‌ కపుల్‌  దీపికా పదుకొణె, రణవీర్ సింగ్  పండంటి పాపాయికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో  ఆడబిడ్డకు తండ్రి కావాలనే రణవీర్ కోరిక నెరవేరింది. అయితే దీపికా తన ముద్దుల తనయ పెంపకం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో  ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను ఫాలో కానుందని సమాచారం. విషయం ఏమిటంటే...

సాధారణంగా చంటిపాపాయి పుట్టినపుడు ఇంట్లో అమ్మమ్మలు, నాన్నమ్మలు, ఇతర పెద్దవాళ్లు తల్లీ బిడ్డల రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంటారు.  చంటిబిడ్డకు నలుగు పెట్టి నీళ్లు పోయడం, పాపాయికి పాలు పట్టించడం, బాలింతకు ఎలాంటి ఆహారం పెట్టాలి లాంటి జాగ్రత్తలు, బాధ్యతలు వాళ్లవే. మకొంతమంది తమ పాపాయిని జాగ్రత్తగా చూసేందుకు ఒక ఆయమ్మను, నానీనో  పెట్టుకుంటారు. చాలామంది సెలబ్రిటీలు లక్షలు ఖర్చుపెట్టి మరీ నానీలను నియమించకుంటారు. కానీ దీపికా మాత్రం ఐశ్వర్య, అలియా భట్, అనుష్క శర్మ పేరెంటింగ్ స్టైల్‌ను ఫాలో అవుతోందట. బాలీవుడ్ లైఫ్ కథనం ప్రకారం దీపిక నానీని ఏర్పాటు చేసుకోకూడదని నిర్ణయించింది. స్వయంగా తానే చిన్ని దీపిక బాధ్యతలను చూసుకోనుందిట.

ఆలియానే ఆదర్శం
మరో విషయం ఏమిటంటే పాప ఫోటోను మరికొన్ని పాటు రివీల్‌  చేయకుండా  గోప్యంగా ఉంచాలని   భావిస్తోందట. కొంచెం పెద్దయ్యాక మాత్రమే తన బేబీని ప్రపంచానికి పరిచయం చేయాలని భావిస్తోంది. ఈ విషయంలో ఆలియాను ఫాలో కానుందట. ఐశ్వర్య తన కుమార్తె పుట్టినపుడు నానీనీ పెట్టుకోలేదట. ఇందుకు ఆమె అత్తగారు జయా బచ్చన్ కూడా 'హ్యాండ్-ఆన్-మామ్'  అంటూ పొగిడింది కూడా.  ఆ తరువాత  అనుష్క శర్మ ,  అలియా భట్‌  ఇదే బాటలో నడిచిన సంగతి తెలిసిందే.

 ఇదీ చదవండి:  ‘బాస్‌! నేనూ వస్తా..’! ఆంబులెన్స్‌ వెనక దౌడుతీసిన కుక్క, వైరల్‌ వీడియో


 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement