ఐటమ్ సాంగ్ చేయాలని.. | i am ready for Item Songs says Kajal Agarwal | Sakshi
Sakshi News home page

ఐటమ్ సాంగ్ చేయాలని..

Published Tue, Mar 17 2015 12:43 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

ఐటమ్ సాంగ్ చేయాలని.. - Sakshi

ఐటమ్ సాంగ్ చేయాలని..

తినగ తినగా గారెలు చేదు అన్న సామెతను గుర్తు చేస్తూ హీరోయిన్ పాత్రల్ని పోషిస్తున్న నటి కాజల్ అగర్వాల్‌కు ఆ జీవితం బోరు కొట్టినట్టుందో లేక సమచరులు శ్రుతి హాసన్, తమన్నలాంటి వాళ్లను స్ఫూర్తిగా తీసుకుందో తెలియదు కానీ ఐటమ్ సాంగ్ చేయాలన్న కోరిక బలంగా ఉందట. హీరోయిన్లుగా నటిస్తూనే, మరో పక్క ఐటమ్ సాంగ్స్‌తో హల్ చల్ చేస్తూ అధిక పారితోషికం పొందాలన్న ఆశ ఈ భామకు  పుట్టింది. మరో విషయం ఏమిటంటే కాజల్ తెలుగులో గ్లామర్ పాత్ర చేసినా, తమిళంలో మాత్రం  మోతాదు మించలేదు.  తమిళ ప్రేక్షకులు ఆమెను గ్లామర్‌గా చూడాలని కోరుకుంటున్నారనే అభిప్రాయాన్ని కాజల్ వ్యక్తం చేస్తున్నారు. నాయకీ పాత్రలతో పాటుగా ఐటమ్ గర్ల్‌గాను, అదే విధంగా ప్రతి నాయకీ పోలికలు ఉన్న పాత్రలను చేయడానికి తాను సిద్ధమని కాజల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ భామ తమిళంలో ధనుష్ సరసన మారీ చిత్రంలో, విశాల్ సరసన సుశీంద్రన్ దర్శకత్వంలో నటిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement