బలవంత పెట్టలేదు | Tamanna Focusses on Glamour Roles | Sakshi
Sakshi News home page

బలవంత పెట్టలేదు

Published Tue, Sep 2 2014 12:48 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

బలవంత పెట్టలేదు - Sakshi

బలవంత పెట్టలేదు

గ్లామర్ పాత్రల్లో మాత్రమే నటిస్తానని ఎవరినీ బలవంతపెట్టలేదని మిల్కీ బ్యూటీ  తమన్నా తెలిపారు. ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ తనకెప్పుడూ నెంబర్ వన్ పోటీపై నమ్మకం లేదన్నారు. తాను నిర్మాత, దర్శకులు, నటీనటులతో సఖ్యతతో మసలుతున్నానని తెలిపారు. శ్రుతిహాసన్, ఇలియానా, కాజల్ అగర్వాల్‌తో స్నేహంగా ఉంటూ అందరికీ అందుబాటులోనే ఉంటున్నానని తెలిపారు. సినిమా, నటనకు సంబంధించిన విషయాలనే గాకుండా అనేక విషయాలను చర్చిస్తుంటామన్నారు.
 
 గ్లామర్ లేని పాత్రల్లో నటిస్తారా? అని ప్రశ్నిస్తున్నారని, ఇది చిత్ర దర్శకుడిని బట్టి ఉంటుందన్నారు. గ్లామర్ ప్రదర్శించాల్సిన క్యారెక్టర్, గ్లామర్ లేని క్యారెక్టర్ అంటూ ఏ రోల్ అయినప్పటికీ నటించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గ్లామర్ లేకుండా నటనకు మాత్రమే ప్రాముఖ్యత వున్న కథా పాత్ర అయితే ఖచ్చితంగా నటిస్తానన్నారు. అనవసర విషయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనని పేర్కొన్నారు. చేతినిండా సంపాదించినా కొంతమట్టుకే ఖర్చు చేస్తానని, అనవసర వస్తువులు కొనుగోలు చేయనన్నారు. అధిక ధరలకు వస్తువులు కొనుగోలు చేయనని, పొదుపు పాటించడమే శ్రేయస్కరమని ముగించారీ ముద్దుగుమ్మ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement