glamour roles
-
కీర్తిసురేష్.. నీకు ఇలాంటివి అవసరమా? అస్సలు సూట్ కాదు
తమిళసినిమా: నటి కీర్తి సురేష్ అతి తక్కువ కాలంలోనే మహానటి చిత్రంలో సావిత్రిగా జీవించి జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. తర్వాత తమిళంలో సాని కాగితం అనే చిత్రంలో లైంగికదాడికి గురై ప్రతీకారేచ్ఛతో రగిలే యువతిగా నటించి ప్రశంసలు అందుకుంది. అదేవిధంగా కొన్ని హీరోయిన్ సెంట్రింగ్ కథా పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఆ చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేదు. దీంతో కీర్తిసురేష్ ఇప్పుడు పూర్తిగా గ్లామర్‌పై దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. కారణం అవకాశాలు తగ్గడమే అని ప్రచారం జరుగుతోంది. తెలుగులో చిరంజీవికి చెల్లెలుగా బోలాశంకర్ చిత్రంలో, నానికి జంటగా దసరా చిత్రంలో నటిస్తోంది. వీటిలో దసరా చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇకపోతే తమిళ్లోను శివకార్తికేయన్‌కు జంటగా నటించిన మావీరన్ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అదేవిధంగా ఉదయనిధి స్టాలిన్ సరసన నటించిన మామన్నన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. దీంతో కీర్తిసురేష్ కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఈమె తరచూ తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు థాయిలాండ్‌లో విహారయాత్ర చేస్తోంది. అక్కడ బికినీ దుస్తుల్లో దిగిన ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కీర్తిసురేష్ హాట్నెస్ ఓవర్ లోడ్ కీర్తి వేరే లెవెల్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే కీర్తి ఇలాంటివి నీకు సరిపడవు. పాత కీర్తిలా ఉంటేనే బాగుంటావు అంటూ సూచనలు ఇస్తున్నారు. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
నాకు గ్లామర్ పాత్రలు చేయాలనుంది: హీరోయిన్
నటి పూనం బాజ్వా గుర్తుందా? చేవల్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన ఉత్తరాది బ్యూటీ ఈమె. ఆ తరువాత తెనావట్టు తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ కొన్ని చిత్రాల్లో నటించిన పూనం భాజ్వా చాలా గ్యాప్ తరువాత కోలీవుడ్‌లో గురుమూర్తి అనే చిత్రంలో నాయికగా నటించింది. నట్టి నటరాజ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నటి పూనం భాజ్వాని పలకరించగా కొన్ని విషయాలను షేర్ చేసింది. ఎలా సాగుతోంది కేరీర్? కోలీవుడ్ తెరపై చూసి చాలాకాలం అయ్యిందే అన్న ప్రశ్నకు బదులిస్తూ నచ్చిన పాత్రని అంగీకరిస్తున్నట్లు చెప్పింది. చదవండి: హీరోతో అభ్యంతరకర సీన్.. నా తల్లిదండ్రులకు చెప్పే చేశా: హీరోయిన్ 2009లో నటిగా కోలీవుడ్‌కు పరిచయం అయ్యానని, ఇప్పటివరకు కథానాయికగా కొనసాగడం సంతోషంగా ఉందని చెప్పింది. ఎలాంటి పాత్రలో నటించాలని కోరుకుంటున్నారని అడగగా తాను తమిళంలో అన్నీ కుటుంబ కథా చిత్రాల్లోనే నటించాలని, గ్లామర్ పాత్రలో నటించే అవకాశం రాలేదని పేర్కొంది. గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. తనకు ముఖ్యంగా దక్షిణాదిలో అత్యధికంగా ఫేస్బుక్ ఫాలోవర్స్ ఉన్నారని చెప్పింది. వారందరూ తన గ్లామరస్ ఫొటోలను ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే అలాంటి ఫొటోలను పోస్ట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. చదవండి: హీరోయిన్‌పై బహిరంగ కామెంట్స్.. నటుడిపై సీరియస్ అయిన చిన్మయి అయినా గ్లామర్‌కు, స్క్రీన్ షోకు తేడా ఉందని చెప్పింది. తాను పరిధి దాటి ఎప్పుడు స్క్రీన్ షో ప్రదర్శన చేయలేదని చెప్పింది. తనకు నాట్యంలో ప్రవేశం ఉందని, అలాంటి పాత్ర వస్తే చేయాలని ఉందని చెప్పింది. కోలీవుడ్‌లో చాలామంది హీరోల సరసన నటించాలని తెలిపింది. అయితే షూటింగ్ పూర్తి కాగానే వారితో పరిచయాలు పెట్టుకోమని చెప్పింది. అయితే నటుడు జీవా తనకు మంచి మిత్రుడు అని చెప్పి వచ్చింది. ఆయన భార్య కూడా తనతో బాగా మాట్లాడుతుందని భాజ్వా చెప్పింది. అలాగే నటుడు భరత్‌తో కూడా మంచి స్నేహం ఉందని చెప్పింది. కోలీవుడ్‌లో మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా పూనం భాజ్వా పేర్కొంది. -
కొద్ది రోజుల్లోనే బోల్డ్ అండ్ బిజీ మోడల్‌గా మారిపోయా..: కరిష్మా శర్మ
సోషల్ మీడియాలో ఆమె ఫొటో కనిపిస్తే చాలు.. సెకనుకో లైక్, కామెంట్, షేర్. ఇప్పుడు వెబ్ స్క్రీన్ మీదా తన చరిష్మా చూపిస్తోంది ఈ టాప్ మోడల్. ►పుట్టింది, పెరిగింది, చదివింది అంతా ఢిల్లీలోనే. ►చిన్నప్పుడు సింగర్, చదువుకునేప్పుడు మోడల్, చదువు పూర్తయ్యాక నటి.. ఇలా ఒక్కో దశలో ఒక్కో కెరీర్‌ను ఎంచుకుంది కరిష్మా. ►కాలేజీ రోజుల్లో చాలామంది తన శరీరాకృతిని, అందాన్ని ప్రశంసిస్తూండడంతో మోడల్ అవ్వాలని ముంబై చేరింది. కొద్ది రోజుల్లోనే బోల్డ్ అండ్ బిజీ మోడల్‌గా మారిపోయింది. ►ఆమెలోని అభినయ కళను గ్రహించిన స్మాల్ స్క్రీన్... సీరియల్స్‌లో అవకాశాలను ఇచ్చింది. ►‘ప్యార్ తూనే క్యా కియా’తో పరిచయమై వరుసగా ‘పవిత్ర్ రిష్తా’, ‘లవ్ బై ఛాన్స్’, ‘యే హై మొహబ్బత్’, ‘ఫియర్ ఫైల్స్’ లోనూ నటించింది. ►ఆ సీరియల్స్, సినిమా చాన్స్‌లను తెచ్చి పెట్టాయి. ‘ప్యార్ కా పంచనామా– 2’ తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ‘సూపర్ –30’ వంటి పలు సినిమాల్లోనూ మెరిసింది. ►‘లైఫ్ సహీ హై’ సిరీస్‌తో వెబ్ దునియాలోకి అడుగుపెట్టి ‘రాగిణి ఎమ్ఎమ్ఎస్: రిటర్న్స్’, ‘హమ్’, ‘ఫిక్సర్’లతో అలరిస్తోంది. చదవండి: మీకు ఎడమచేతివాటం ఉందా?.. ఇవి తప్పక తెలుసుకోండి.! -
గ్లామర్ రోల్స్‌కు సై!
గ్లామర్ అంటే భయపడి పారిపోయే దానిని కానని అంటోంది నటి మీరా మిథున్. మోడలింగ్ రంగం నుంచి సిల్వర్స్క్రీన్లో రాణించాలని ఆరాటపడుతున్న బ్యూటీ ఈమె. ఇప్పటికే కోలీవుడ్‌లో రెండు చిత్రాల్లో నటించిన మీరా మిథున్ ప్రస్తుతం బోదై ఏరి బుద్ధిమారి అనే చిత్రంలో నటిస్తోంది. సినిమాల్లో నటిస్తున్నా మోడలింగ్‌ను మాత్రం వదలలేదు. ప్రపంచవ్యాప్తంగా చుట్టేస్తున్న ఈ బ్యూటీ సినిమాల్లోనూ నటిగా గుర్తింపు పొందాలని ఆశిస్తోంది. ఈ సందర్భంగా ఈ అమ్మడు చెప్పిన సంగతులు చూద్దాం. బోదై ఏరి బుద్ధిమారి చిత్రం గురించి చెప్పాలంటే ఇందులో నేను చాలా అర్థవంతమైన పాత్రలో నటిస్తున్నాను. చిత్రం పేరు చూడగానే ఇదేదో మద్యం ఆరోగ్యానికి హానికరం అని సలహా ఇచ్చే కథా చిత్రం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇటీవల తెరపైకి వచ్చిన తడం మాదిరి ఉత్కంఠభరితంగా సాగే థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుంది. ఈ చిత్ర దర్శకుడు ఇంతకు ముందు లఘు చిత్రాలను రూపొందించారు. బోదై ఏరి బుద్ధిమారి చిత్ర కథను చెప్పగానే ఈ పాత్రను నేనే చేయాలనిపించింది. అయితే చిత్రంలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. దీన్ని ఒక చక్కని దృశ్య కావ్యంగా ఛాయాగ్రాహకుడు బాలసుబ్రమణియం తీర్చిదిద్దారు. ఈ చిత్రం కాకుండా మరో మూడు చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయి. పాత్ర కోసం గుండు కొట్టించుకోవడానికైనా సిద్ధమే. నేను జాతీయ ఉత్తమ నటి అవార్డును పొందాలన్నది మా నాన్న కల. ఆయన ఇప్పుడు లేరు. అయినా ఆ అవార్డును సాధిస్తాను. అలాంటి పాత్రలో నటించే అవకాశం వస్తే పారితోషికం లేకుండా నటించానికి రెడీ. నేను చెన్నై అమ్మాయినే. తమిళ అమ్మాయిలు గ్లామర్ అంటేనే చెవులు మూసుకుని పారిపోతారనుకుంటే, మోడలింగ్ ప్రపంచంలో లేని గ్లామరా నేను అక్కడి నుంచి వచ్చాను. కాబట్టి నాకు హద్దులు తెలుసు. గ్లామర్ అంటే పారిపోను. కథకు అవసరం అయితే అందాలారబోతకు సిద్ధమే అని అంటోంది నటి మీరా మిథున్. -
అలాంటి పాత్రల్లో నటించను : కీర్తి సురేష్
కీర్తిసురేశ్ ఈమె పేరులోనే కీర్తి ఉందనుకుంటే ఇప్పుడు తన ప్రతిభతోనూ ఆ పేరును సార్ధకం చేసుకుంటోంది. నిజం చెప్పాలంటే ఆమె తల్లి మేనక సాధించలేని కలలను ఈ అమ్మడు నెరవేర్చుతోందని చెప్పవచ్చు. మేనక రజనీకాంత్‌కు జంటగా నెట్రకన్ చిత్రంలో నటించినా, ఆ తరువాత తమిళంలో పెద్దగా పేరు తెచ్చే చిత్రాల్లో నటించలేదు. మలయాళీ చిత్ర నిర్మాత సురేశ్‌ను పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అయ్యారు. అలా ఆమె వారసురాలిగా పరిచయమైన కీర్తీసురేశ్ నటించిన తొలి చిత్రం ఇదు ఎన్న మాయం నిరాశపడడంతో ఈ అమ్మడికి నటిగా పెద్దగా భవిష్యత్తు ఉండదేమో అనే టాక్ అప్పట్లో వినిపించింది. అలాంటిది రజనీమురుగన్, రెమో వంటి చిత్రాలు వరుసగా విజయం సాధించడం, మహానటి చిత్రంలో సావిత్రిని మరిపించడం వంటివి కీర్తీసురేశ్ స్థాయిని పెంచేశాయి. అంతే స్టార్ హీరోలు విజయ్, విశాల్, విక్రమ్ వంటి వారితో నటించేసి స్టార్ హీరోయిన్ లిస్ట్‌లో చేరిపోయింది. మరో విషయం ఏమిటంటే కమర్శియల్ చిత్రాల్లో నటించాలంటే అందాలు ఆరబోయాలనే ట్రెండ్‌ను బ్రేక్ చేసిన నటి కీర్తీసురేశ్. ఈ బ్యూటీ ఇప్పటి వరకూ నటించిన చిత్రాలన్నింటిలోనూ పక్కింటి అమ్మాయి ఇమేజ్‌నే తెచ్చుకుంది. ఇకపై కూడా ఇలానే నటిస్తానంటోంది. ప్రస్తుతం కొత్త చిత్రాల ఎంపికలో బిజీగా ఉన్న కీర్తీసురేశ్ ఆమెను వెతుకుంటూ వస్తున్న గ్లామర్ పాత్రలను సున్నితంగానే తిరస్కరిస్తోందట. దీని గురించి ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ గ్లామర్ పాత్రల్లో నటించి చాలా సంపాందించుకోవచ్చునని, అయితే అలాంటి పాత్రల్లో నటించడం తనకు సమ్మతం కాదని చెప్పింది. మహానటి చిత్రంలో నటించనట్లుగా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నానని చెప్పింది. చాలా డబ్బు సంపాదించాలనే కంటే కథానాయకికి ప్రాముఖ్యత ఉన్న బలమైన పాత్రల్లో నటించి ఆత్మ సంతృప్తి పొందాలన్నదే తన ఆశ అని పేర్కొంది. ఈ బ్యూటీ త్వరలో బాహుబలి ఫేమ్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. -
సినిమాలోకం చాలా విచిత్రమైంది
తమిళసినిమా: సినిమాలోకం చాలా విత్రమైంది. ఎవరిని ఎప్పుడు అందలం ఎక్కిస్తుందో..? ఎవరిని ఎలా ఢమాల్ అని కిందకు పడేస్తుందో ఊహించడం కష్టం. ఇంతకు ముందు వరుస విజయాలతో దూచుకుపోయిన వారు తరువాత అనూహ్యంగా వెనుకపడిపోతున్నారు. అలాంటి వారిలో నటి శ్రీదివ్య ఒకరని చెప్పాలి. ‘వరుత్తపడాద వాలిభన్’చిత్రంలో శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేసి హిట్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిన తెలుగమ్మాయి శ్రీదివ్య. తరువాత జీవా, కాక్కీసట్టై, ఈటీ, సంగిలి బుంగిలి వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మపై పక్కింటి అమ్మాయి అనే మంచి ఇమేజ్ పడింది. అలాంటిది ఇటీవల ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి. అంతే కాదు ఇళయదళపతితో ‘మెర్శల్’చిత్రంలో నటించే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయింది ఈ బ్యూటీ. కాల్షీట్స్ సమస్యతో శ్రీదివ్య వదులుకున్న ఆ అవకాశం నటి నిత్యామీనన్‌ను వరించిందట. మెర్శల్ చిత్రంలో సమంత, కాజల్ అగర్వాల్ ఉన్నా, ఎక్కువ క్రెడిట్ నటి నిత్యామీనన్కే దక్కిందన్నది గమనార్హం. కారణాలేమైనా ప్రస్తుతం కోలీవుడ్‌లో అధర్వకు జంటగా నటిస్తున్న ‘ఒల్తైకు ఒల్తై’ చిత్రం ఒక్కటే చేతిలో ఉంది. దీంతో అంతకు ముందు మాతృభాషలో నటించిన శ్రీదివ్య ఇప్పుడు మళ్లీ అక్కడ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పక్కింటి అమ్మాయి ఇమేజ్ కారణంగానే అవకాశాలు దగ్గరకు రావడం లేదన్న అభిప్రాయానికి వచ్చింది శ్రీదివ్య. తను ఇక లాభం లేదు ఆ ఇమేజ్ను బ్రేక్‌చేసి అందాలారబోతలో విజృంభించాల్సిందేనని నిర్ణయించుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మొత్తం మీద ఇకపై గ్లామర్‌నే నమ్ముకోవడానికి సిద్ధం అవుతున్నారన్నమాట. మరి ఈ కొత్త రూటు శ్రీదివ్యను మళ్లీ బిజీ చేస్తుందేమో చూడాలి. -
సారీ అలాంటి పాత్రల్లో మేం నటించలేం!
సాక్షి, సినిమా : మన హీరోయిన్లు గ్లామరస్, టాప్‌లెస్ ఫోటోలతో పత్రిక ముఖ చిత్రాల్లో దుమ్ము రేపుతున్నారు. ఇక సినిమాల్లోనూ అర్ధనగ్నంగా నటించడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఇక ఈత దుస్తులు, అరకొర దుస్తులను ధరించి నటించడానికి అభ్యంతరం చెప్పడం లేదు. మరి కొందరైతే అడిగి మరీ లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించి వివాదాలతో వార్తల్లో ఉండాలని కోరుకుంటున్నారు. అదేమంటే సినిమా గ్లామర్ ప్రపంచం అని, అయినా గ్లామర్‌గా నటించడంలో తప్పేంటి? లాంటి ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఇలాంటి రోజుల్లో గ్లామరస్ దుస్తులా సారి. మేము గ్లామర్‌కు దూరం అనే హీరోయిన్లు ఉంటారా? ఉన్నారంటున్నారు సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరి లాంటి వాళ్లు. మాలీవుడ్ భామలయిన వీరిద్దరూ కోలీవుడ్, టాలీవుడ్ అంటూ వరస పెట్టేస్తున్నారు. అతి తక్కువ కాలంలో టాలీవుడ్లో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ ఇప్పటి వరకూ నటించిన చిత్రాల్లో పక్కింటి అమ్మాయిల్లానే కనిపించారు. వీరికి ప్రస్తుతం చాలా అవకాశాలు వస్తున్నా నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంచుకుని నటిస్తామంటున్నారు. ఇకపై కూడా అలాంటి ఇమేజ్‌నే కాపాడుకోవాలని భావిస్తున్నట్లు, అందువల్ల గ్లామరస్ పాత్రల్లో నటించే ఆలోచన లేదని చెబుతున్నారు. చూద్దాం ఈ ముద్దుగుమ్మలు తమ మాట మీద ఎంత కాలం నిలబడతారో! -
రూట్ మార్చిన నివేదా!
సాక్షి, సినిమా: సినిమాల్లో ఎవరైనా ఒకే రకం మూస పాత్రల్లో నటిస్తే ప్రేక్షకులు మాత్రం ఎంత కాలం చూస్తారు. వాళ్లకు మొహం మొత్తుతుంది. ఇక సినిమాల్లో గ్లామర్‌ను వేరు చేయలేం. సందేశాలిచ్చే సన్నివేశాలను బోర్ అనుకుంటారేమోగానీ, అందాలతో కనువిందు చేసే అంశాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఎంజాయ్ చేస్తారు. అందుకే హీరోయిన్లు మొదట్లో ఒకటి రెండు చిత్రాల్లో కుటుంబ కథా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నా, ఆ తరువాత కచ్చితంగా గ్లామర్‌నే ఆశ్రయిస్తారు. ఎందుకంటే ప్రేక్షకులు ఎక్కువగా గ్లామర్‌నే కోరుకుంటున్నారు. ఇలా చాలా మంది హీరోయిన్ల దారిలోనే నటి నివేదా పేతురాజ్ నడవడానికి సిద్ధం అయిపోయింది. ఒరునాళ్ కూత్తు చిత్రంలో పక్కింటి అమ్మాయిలా కనిపించిన ఈ అచ్చతమిళ్ అమ్మాయి. జయం రవితో డ్యూయెట్లు పాడుతున్న టిక్ టిక్ టిక్ త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా నివేదా పార్టీలో మజా చేస్తోంది. పార్టీ అంటేనే మజాగా ఉంటుంది. అయితే ఈ పార్టీ మీరూహించుకునేది కాదు. ఈ పార్టీ సినిమా పేరు. యువతను ఆకట్టుకునే టెక్నిక్‌ను గట్టిగా పట్టుకున్న వెంకట్‌ప్రభు దీనికి దర్శకుడు. అమ్మా క్రియోషన్స్ శివ నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలైంది. చాలా కలర్ఫుల్గా ఉన్న ఈ టీజర్లో నటి నివేదాపేతురాజ్ రసరమ్యమైన సన్నివేశాలు యువతను గిలిగింతలు పెడుతున్నాయి. ఆమె పడక గది సన్నివేశాలు పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి. ఒరునాళ్ కూత్తు నాయకియేనా ఈ అమ్మడు అని ఆశ్చర్యపోతున్నారు. ఇక నెటిజన్లకు మాత్రం పార్టీ టీజర్ పెద్ద పనే కల్పించేస్తోంది. ఇందులో నివేదా పేతురాజ్‌తో పాటు నటి రమ్యకృష్ణ, రెజీనా, సంచితాశెట్టి లాంటి గ్లామర్ తారలు నటిస్తున్నారు. ఇక సీనియర్ నటులు సత్యరాజ్, నాజర్ వంటి వారితో జై,శివ వంటి యువ నటులు ఉన్నారు.దీనికి ప్రేమ్‌జీ సంగీతాన్ని అందిస్తున్నారు. పార్టీ త్వరలోనే కనువిందు చేయడానికి రెడీ అవుతోంది. -
రెచ్చిపోతున్న రాయ్‌లక్ష్మి
నటి రాయ్‌లక్ష్మి గ్లామర్ అంతు చూడాలని కంకణం కట్టుకున్నట్లున్నారు. ఆ విధంగా గ్లామర్‌నే సిగ్గుపడేలా దుస్తులు ధరించి వేదికలెక్కెస్తున్నారు. కళ్లార్పకుండా చూడడం చూపరులపనవుతోంది. తమిళంలోనే పలు చిత్రాల్లో గ్లామరస్‌గా నటించి దుమ్మురేపిన రాయ్‌లక్ష్మి తాజాగా బాలీవుడ్లో మరింతగా రెచ్చిపోతున్నారు. కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ అంటూ ఒక రౌండ్ కొట్టిన రాయ్‌లక్ష్మి ఇప్పుడు బాలీవుడ్‌ను టార్గెట్ చేశారు. కబాలి హీరోయిరెచిపోతున్ రాధికాఆప్తే ఇటీవల ఒక ఆంగ్ల చిత్రం కోసం నటించిన టాప్‌లెస్ దుస్తుల సన్నివేశాలు ఇంటర్నెట్లో కలకలం పుట్టించిన విషయం తెలిసిందే. ఇక నటి కాజల్‌అగర్వాల్, శ్రుతిహాసన్ టాప్‌లెస్ దుస్తులతో సినిమాల్లో నటించకపోయినా, ఆ తరహా దుస్తులతో ఆంగ్ల పత్రికల ముఖ చిత్రాలకు ఫోజులిచ్చి సంచలనం కలిగించారు. ఇప్పుడు వాళ్ల వరుసలో నటి రాయ్‌లక్ష్మి చేరారు. హిందీ చిత్రం జూలీ-2 లో ఇప్పటికే టూ పీస్, ఈత దుస్తుల్లో నటించి బాలీవుడ్ పరిశ్రమ వర్గాల దృష్టిని తనపై తిప్పుకునే ప్రయత్నం చేసిన ఈ సంచలన నటి ఇటీవల టాప్‌లెస్ దుస్తులు ధరించి సినిమా కార్యక్రమంలో పాల్గొని హల్చల్ చేశారు. బాలీవుడ్ బ్యూటీస్ ప్రియాంకా చోప్రా, దీపికాపదుకొనే లాంటి వారు బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లే ప్రయత్నంలో ఉంటే, కోలీవుడ్ నుంచి బాలీవుడ్ రంగప్రవేశం చేయాలన్న తన కోరిక నె రవేరడంతో రాయ్‌లక్ష్మి అక్కడి సినీ వర్గాలను ఆకర్షించి బాలీవుడ్లోనే సెటిల్ అవ్వాలన్న ఆలోచినలో భాగంగానే గ్లామర్ అంతు చూసే ప్రయత్నంలో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు. -
ఇక గ్లామర్‌కు నో
వెండి తెరపై అందాలు పరచడానికి ఏ మాత్రం వెనుకాడని నటీమణుల్లో కాజల్ అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. సహ హీరోయిన్లు తమన్న, శ్రీయ లాంటి వారితో పోటీ పడి మరీ గ్లామరస్ పాత్రల్లో దుమ్మురేపారని అనాలి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ చుట్టేస్తున్న కాజల్ అగర్వాల్‌లో తాజాగా ఒక నిర్ణయం తీసుకుందట. ఇకపై అందాలారబోత విషయంలో హద్దులు మీరరాదన్నదే ఆ నిర్ణయం.ప్రస్తుతం హిందీలో టు లబ్జాన్ కీ కహానీ అనే చిత్రంలో నటిస్తున్న కాజల్ ఈ విషయం గురించి మాట్లాడుతూ నటిగా తానిప్పుడు ఉన్నత స్థానంలోనే ఉన్నానన్నారు. ప్రముఖ నటులందరితోనూ నటించానని అదే విధంగా గ్లామర్, నటనకు అవకాశం ఉన్న కథా చిత్రాలు అంటూ అన్ని రకాల పాత్రలు చేశానని పేర్కొన్నారు. ఇకపై గ్లామర్‌ను తగ్గించి నటనకు చాలెంజ్‌గా ఉండే పాత్రలకు ప్రాముఖ్యత నివ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం టు లబ్జాన్ కీ కహానీ అనే హిందీ చిత్రంలో అంధురాలిగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం చాలా రిహార్శల్స్ చేసినట్లు, అంద పాఠశాలలకు వెళ్లి అక్కడ అంధుల హావభావాలను, వారి శారీరక భాష గురించి గమనించినట్లు తెలిపారు. ఏదేమైనా కాజల్ అగర్వాల్ నిర్ణయం మంచిదే. అయితే దానికి తన ఎంతవరకు కట్టుబడి ఉంటారన్నదే ప్రశ్న అంటున్నారు చిత్ర వర్గాలు. -
గ్లామర్ పాత్రలు రావడం లేదు
తమిళసినిమా : గ్లామర్‌తోనే మనుగడ అనే నిర్ణయానికి మన హీరోయిన్లు వచ్చేసినట్లు ఉన్నారు. ఇంతకు ముందు నటనకు అవకాశం ఉన్న పాత్రల కోసం ఎంత కాలం అయినా వేసి చూస్తామనే మాటలు విన్న వారి నోటి నుంచి ఇప్పుడు అందాలారబోతకు నేను వ్యతిరేకం కాదు అనే వ్యాఖ్యలు వినాల్సి వస్తోంది. అంతగా ఈతరం హీరోయిన్లు మైండ్ సెట్‌ను మార్చుకుంటున్నారు. ఆ మధ్య యువనటి రెజీనా గ్లామర్‌కు నేను దూరం అంటూ మడి కట్టుకు కూర్చుంది. దీంతో చిత్ర పరిశ్రమ అమ్మడిని పక్కన పెట్టేశాయి. ఇది గ్రహించిన రెజీనా అందాలారబోతకు నేను సైతం సిద్ధమంటూ గేటులెత్తేసింది. తాజాగా నటి స్వాతికి జ్ఞానోదయం అయినట్లుంది. ఈ తెలుగింటి ఆడపడుచుకు ఇప్పటి వరకూ కాస్త మంచి ఇమేజే ఉంది. అయితే అది ఆఫర్లను రాబట్టడం లేదు. స్వాతి చాలా కాలంగా నటిగా కొనసాగుతున్నా ప్రముఖ స్థానాన్ని అందుకోలేకపోయింది. చిన్న చిన్న నాయకులతోనే రొమాన్స్ చేయాల్సి వస్తోంది. అదీ అడపాదడపానే అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. స్వాతి నటించిన తెలుగు చిత్రం త్రిపుర శుక్రవారం తెరపైకి రానుంది. కొత్త చిత్రం ఏదీ లేదు. తమిళంలో సుబ్రమణిపురం, వడకర్రి, యట్చన్ లాంటి చిత్రాల్లో నటించినా ఇక్కడా ప్రస్తుతం అవకాశాలు నిల్.దీంతో స్వాతి కొత్తరాగం అందుకుంది. నాకు గ్లామర్ పాత్రల అవకాశాలు రావడం లేదు అన్నదే ఆమె తాజా ఆరోపణ. మరీ అసభ్య సన్నివేశాల్లో నటించకూడదన్నది తన పాలసీ. అందుకు తనను ఇప్పటి వరకూ గ్రామీణ యువతి పాత్రలకు పక్కింటి అమ్మాయి ఇమేజ్ పాత్రలకు పరిమితం చేశారు. నవ నాగరీక అమ్మాయి పాత్రలో నటించాలని ఆశగా ఉంది. అందాలారబోతకు తాను వ్యతిరేకిని కాదు. అయితే హద్దులు దాటేవిగా ఉండే గ్లామర్ పాత్రలకు దూరం అని చెప్పింది. -
పెళ్లైనా గ్లామర్‌రోల్స్ వదలను
-
అందులో తప్పేముంది?
వినేవాళ్లుంటే ఎన్నయినా చెబుతారనే నానుడి ఉంది. మన హీరోయిన్ల గ్లామర్ గురించి ఒక్కొక్కరు ఒక్కో కథ చెబుతుంటారు. కొందరు గ్లామర్‌కు దూరమంటారు. మరికొందరు దేనికయినా హద్దులుంటాయంటారు. ఇంకొందరు గ్లామర్‌గా నటిస్తే తప్పేంటి? అని ఎదురు ప్రశ్న వేస్తారు. ఇక నటి కాజల్ అగర్వాల్ అయితే అదేమయినా పెద్ద నేరమా? అంటున్నారు. నిజం చెప్పాలంటే ఇలాంటి వాళ్లంతా గ్లామర్‌ను నమ్ముకున్నవాళ్లే అని చెప్పొచ్చు. ఒకటీఅరా చిత్రాల్లో అభినయంతో కూడిన పాత్రలు చేసినా తారకమంత్రం మాత్రం అందాలారబోతే. అందుకే గ్లామర్‌ను వెనుకేసుకొస్తారు. ఇంతకుముందు వరకు తన మేకప్ మెరుగులతో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూ వచ్చిన ఈ అమ్మడి అందాలు వారికి మొహమొత్తినట్లుంది. లేదా టాలీవుడ్‌కే బోర్ కొట్టినట్లుంది. ఏదేమైనా మొత్తానికి ఈ భామకు అక్కడ అవకాశాలు కరువయ్యాయి. దీంతో అమ్మడి దృష్టంతా కోలీవుడ్ పైనే పెట్టింది. ఇక్కడ కూడా తన అందాలనే నమ్ముకున్నారనే ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న చిత్రాల్లో అందాలారబోతలతో మోతెక్కిస్తున్నారట. దీనిగురించి అడిగినవాళ్లతో గ్లామర్‌గా నటించడం పెద్ద నేరమా? అభిమానులు గ్లామర్‌ను కోరుకుంటున్నారు. వారిని సంతోషపెట్టడానికి మేము గ్లామర్‌గా నటిస్తున్నాం. దాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తాను ధనుష్‌తో నటిస్తున్న మారి, విశాల్‌కు జంటగా చేస్తున్న పాయంపులి చిత్రాలు అభిమానులు తనపై నమ్మకాన్ని పెంచుతాయనే విశ్వాసాన్ని కాజల్‌అగర్వాల్ వ్యక్తం చేశారు. ఈ రెండు చిత్రాలు మినహా అమ్మడికి వేరే అవకాశాలు లేవన్నది గమనార్హం. -
అందాలారబోతకు సై
అందాలారబోతకు దూరం అన్న చాలా మంది ప్రముఖ నటీమణులు ఆ తరువాత తెరపై గ్లామర్‌ను గుమ్మరించారు. ఇప్పుడు నటి మేఘ్నారాజ్ కూడా ఈ కోవలోకి చేరారు. కోలీవుడ్‌లో ఉయిర్ తిరు 420, నందానందిత చిత్రాల్లో నటించిన ఈ మళయాలి బ్యూటీకి ఆ చిత్రాలేవీ విజయాల్ని అందించలేదు. దీంతో మాతృభాషతో పాటు తెలుగు, కన్నడం భాషా చిత్రాలపై దృష్టి సారించారు. తెలుగులో బెండుఅప్పారావు చిత్రంలో చేసినా పెద్దగా పేరు రాలేదు. ప్రస్తుతం మలయాళం,కన్నడ భాషల్లో అడపాదడపా చిత్రాలు చేస్తున్న మేఘ్నారాజ్కు కోలీవుడ్‌లో ఒక అవకాశం వచ్చింది. మలయాళంలో నటి సీమ నటించిన అవలోర్ రావుగళ్ చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేస్తున్నారు. ఇందులో నాయకి పాత్రకు శృంగారభరిత సన్నివేశాలు ఉంటాయట. తమిళంలో ఈ పాత్ర పోషించడానికి చాలా మంది హీరోయిన్లు నిరాకరించడంతో ఆ అవకాశం నటి మేఘ్నారాజ్ తలుపు తట్టిందని సమాచారం. అయితే మేఘ్నా ఆ చాన్స్‌ను మంచి తరుణం మించిపోనీకూ అన్న చందాన మరు మాట చెప్పకుండా ఒప్పేసుకున్నారట. త్వరలో తమిళ తెరపై మేఘ్నా అందాలు చూడబోతున్నామన్నమాట. -
ఆ చిత్రాలు చేసుంటే రికార్డ్ సాధించేదాన్ని
గ్లామరస్ పాత్రల అవకాశాలన్నీ అంగీకరించి చేస్తే నా బ్యాంక్ బాలెన్స్ ఎప్పుడో ఫుల్ అయ్యేది. పలు చిత్రాలు చేసిన నటిగా రికార్డ్ సాధించేదాన్ని అంటున్నారు నటి నిత్యామీనన్. కోలీవుడ్‌లో మొట్టమొదటిసారిగా ఒకేసారి ఓ కాదల్ కణ్మణి, కాంచన-2 చిత్రాలతో విజయాన్ని అందుకున్న నటి నిత్యామీనన్. అయితే ఈమె పలు షరతులు విధిస్తుందని, ఇంకా చెప్పాలంటే చాలా పొగరుబోతు అని ప్రచారంలో ఉంది. ఈ విషయంపై నిత్యామీనన్ స్పందిస్తూ సినిమాను ఒక కళగా భావిస్తానన్నారు . అంతేకాని డబ్బు సంపాదించే వృత్తిగా చూడనన్నారు. తాను నటించే పాత్ర తనలో ప్రవేశించాలని, అలా కాకుండా షూటింగ్ స్పాట్‌కు వచ్చామా? దర్శకుడు చెప్పిన సంభాషణలు బట్టీపట్టి ఆయన సూచనలు మేరకు నటించామా? వెళ్లామా? అన్నట్టు ఉండలేనన్నారు. తన కిచ్చిన పాత్రలో జీవించడానికి ప్రయత్నిస్తానన్నారు. కాంచన-2 చిత్రంలో వికలాంగురాలి పాత్రలో నటించమని లారెన్స్ కోరినప్పుడు తాను వెంటనే ఓకే చెప్పలేదన్నారు. ఆ పాత్రలో తాను నటించగలనా అని ప్రాక్టీస్ చేసి సంతృప్తి కలిగిన తరువాత నటిస్తానని చెప్పానన్నారు. తన కోసం లారెన్స్ రెండు నెలలు వేచి ఉన్నారని తెలిపారు. తన పాత్ర గురించి ముందుగా చాలా ప్రశ్నలు వేస్తానన్నారు. అంగీకరించిన తరువాత ఇక ప్రశ్నలే తావుండదని అన్నారు. మరో విషయం ఏమిటంటే తనను గ్లామర్ పాత్రల్లో నటించమని పలువురు అడిగారన్నారు. అవన్నీ ఒప్పుకుంటే తన బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడో ఫుల్ అయిపోయి ఉండేదని అలాగే పలు చిత్రాలు చేసిన నటిగా గుర్తింపు పొందేదాన్నని నిత్యామీనన్ అన్నారు. -
అందాలు ఆరబోయాలట
అందాలను విచ్చల విడిగా ఆరబోయడానికి నేను సైతం అంటున్న నేటి హీరోయిన్ల మధ్య దేనికైనా హద్దులు ఉంటాయని అంటోంది నటి శ్రీదివ్య. ఈ అచ్చ తెలుగు అమ్మాయి తమిళ చిత్ర పరిశ్రమలో వరుసగా విజయాలు సాధించి పక్కింటి అమ్మాయి ఇమెజ్‌ను సొంతం చేసుకుంది. అలాంటి ఇమెజ్‌ను పొందడం తన అదృష్టాంగా భావిస్తున్న శ్రీదివ్య దానిని దూరం చేసుకోనని అంటోన్నది. వర్తపడాద వాలిబర్ సంఘం చిత్రం విజయంతో తమిళ చిత్ర పరిశ్రమ దృష్టిని తన వైపుకు తిప్పుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత నటించిన జీవా కూడా విజయం బాట పట్టడంతో ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను చిత్రాల వరకు ఉన్నాయి. 2010లో మనసారా చిత్రంతో టాలీవుడ్లో పరిచయమైన శ్రీ దివ్యను టాలీవుడ్కంటే కోలీవుడ్ అధికంగా ఆదుకుందని చెప్పక తప్పదు. తమిళ చిత్ర పరిశ్రమలోనే తనకు మంచి అవకాశాలు వస్తున్నాయని ఈ బ్యూటీ పేర్కొంది. అయితే, ఎక్కువగా లంగావోని, చీర కట్టు పాత్రలకు పరిమితం చేస్తున్నారని, అది కాస్త చింత కల్గించే విషయమేనని అంటోంది. తనకు మోడ్రన్ దుస్తులు ధరించాలంటే, చాలా ఇష్టం అని, అయితే మోడ్రన్ పాత్రలు వేరు, గ్లామరస్ పాత్రలు వేరని చెబుతున్నది. ఇటీవల ఓ చిత్రంలో అందాల ఆరబోయాలని చెప్పడంతో అది ప్రముఖ హీరోతో నటించే చిత్రమైనా నిరాకరించినట్లు పేర్కొంది. తాను పాత్రల వైవిధ్యానికే ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది. తన ముఖంలోని అమాయకత్వమే తనకు ప్లస్ అని పేర్కొంది. ప్రస్తుతం శ్రీ దివ్య పెన్సిల్, ఈటీ, బెంగళూరు డేస్ రీమేక్ చిత్రం, కవలై వేండాం చిత్రాలతో పాటుగా కార్తీతో ఓ చిత్రం చేయనున్నది. -
గ్లామర్‌కు ఓకే
ప్రేమ నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు. కొందరి విషయాన్ని బాహాటంగా చెప్పినా మరికొందరు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతుంటారు. నటి రెజినా మాత్రం నేనిప్పుడు ప్రేమిస్తున్నాను అంటున్నారు. ఈ డేరింగ్ బ్యూటీ సంగతేమిటో చూద్దామా. కోలీవుడ్‌లో కండనాళ్ ముదల్ చిత్రంలో నటి లైలాకు చెల్లెలిగా 2005లో పరిచయం అయిన నటి రెజినా, ఆ తరువాత అళగియ అసూర, పంచామృతం, కేడి బిల్లా కిల్లాడి రంగా, నిర్ణయం, ఇటీవల విడుదలైన రాజతందిరం తదితర చిత్రాల్లో నాయకిగా నటించారు. ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ హీరోయిన్గా రైజింగ్‌లో ఉన్న రెజినాతో చిన్న భేటీ.... ప్రశ్న:తమిళంలో సీజన్ చూసి నటిస్తున్నారే? జవాబు: చాలామంది ఈ ప్రశ్న అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే ఇబ్బడి ముబ్బడిగా అవకాశాలు రావాలి, ఎడాపెడా నటించేయాలని నేను కోరుకోవడం లేదు. మరో విషయం ఏమిటంటే నేనిప్పటి వరకు తమిళంలో నటించింది ఆరు చిత్రాలే. దీంతో మళ్లీ తమిళంలో నటిస్తారు అన్న ప్రశ్న చాలామంది నుంచి వస్తోంది. కారణం నేను ఎంచుకుంటున్న చిత్రాల పాత్రలు అలాంటివి. ప్రస్తుతం స్టూడియో గ్రీన్ సంస్థలో చేస్తున్నాను. అలాగే తెలుగులో సుబ్రమణ్యం ఫర్ సేల్ అనే చిత్రం చేస్తున్నాను. ప్రశ్న: మూస పాత్రలు అని బోర్‌గా ఫీలైన సందర్భాలున్నాయా? జవాబు: కేడి బిల్లా కిల్లాడి రంగా తరువాత తమిళంలో అలాంటి అవకాశాలే రావడంతో అంగీకరించలేదు. తమిళ ఆడియన్స్ హోమ్లీ పాత్రలనే ఇష్టపడతారు. ఇప్పుడు అలాంటి పాత్రలు వరిస్తున్నాయి. ప్రశ్న: సైకలాజి చదివారట. నటిగా మీకది ఎంతవరకు హెల్ప్ అవుతుంది? జవాబు: చాలా హెల్ప్ అవుతోంది. రకరకాల మనస్తత్వాల మనుషుల మయం సినిమా రంగం. వారి ఆలోచనలు, ఆచరణలు భిన్నంగా ఉంటాయి. అలాంటి వారిని అర్థం చేసుకుని ప్రవర్తించడానికి నేను చదివిన సైకాలజీ చాలా ఉపయోగపడుతుంది. ప్రశ్న: కమర్షియల్ చిత్రాలే మీ లక్ష్యమా? జవాబు: అలాగని ఏమీ లేదు. ఫ్యామిలీ కథా చిత్రాల్లోనూ నటిస్తాను. అదే సమయంలో కమర్షియల్ కథలతో రూపొందే మాస్ చిత్రాలు చేస్తాను. ప్రశ్న: మరి గ్లామర్ విషయం ఏమిటి? జవాబు: కథ హద్దులు మీరని గ్లామర్‌కు నేను ఓకే. సినిమాకు గ్లామర్ కూడా అవసరం అని నా అభిప్రాయం. పరిమితులు దాటని వరకు గ్లామర్‌గా నటించడానికి అభ్యంతరం లేదు. ప్రశ్న: టాలీవుడ్లో మీకో నిక్‌నేమ్ ఉందట? జవాబు: అవును. అక్కడి అభిమానులు ముద్దుగా మెగా హీరోయిన్ అని పిలుస్తుంటారు. అలాంటి అభిమానుల ఆదరణ చివరి వరకు ఉండాలని ఆశిస్తున్నాను. ప్రశ్న: మీలో గాయని కూడా ఉన్నారట? జవాబు: సంప్రదాయబద్ధంగా శిక్షణ పొందకపోయినా కొంచెం బాగానే పాడగలను. మీకో విషయం తెలుసా రాజతందితరం చిత్రంలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. తెలుగులోనూ చెప్పాలని ఉన్నా బిజీ కారణంగా అది సాధ్యం కావడం లేదు. ప్రశ్న: చివరి ప్రశ్న టాలీవుడ్ హీరో ఒకరితో ప్రేమలో పడ్డారట? జవాబు: ఇప్పటి వరకు నాపై ఎలాంటి గ్యాసిప్స్ రాలేదు. అలాంటిది ప్రశ్న ఎలా అడిగారో తెలియదు. నిజానికి నేని ప్పటి వరకు ఎవరిని ప్రేమించలేదు. -
బలవంత పెట్టలేదు
గ్లామర్ పాత్రల్లో మాత్రమే నటిస్తానని ఎవరినీ బలవంతపెట్టలేదని మిల్కీ బ్యూటీ తమన్నా తెలిపారు. ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ తనకెప్పుడూ నెంబర్ వన్ పోటీపై నమ్మకం లేదన్నారు. తాను నిర్మాత, దర్శకులు, నటీనటులతో సఖ్యతతో మసలుతున్నానని తెలిపారు. శ్రుతిహాసన్, ఇలియానా, కాజల్ అగర్వాల్‌తో స్నేహంగా ఉంటూ అందరికీ అందుబాటులోనే ఉంటున్నానని తెలిపారు. సినిమా, నటనకు సంబంధించిన విషయాలనే గాకుండా అనేక విషయాలను చర్చిస్తుంటామన్నారు. గ్లామర్ లేని పాత్రల్లో నటిస్తారా? అని ప్రశ్నిస్తున్నారని, ఇది చిత్ర దర్శకుడిని బట్టి ఉంటుందన్నారు. గ్లామర్ ప్రదర్శించాల్సిన క్యారెక్టర్, గ్లామర్ లేని క్యారెక్టర్ అంటూ ఏ రోల్ అయినప్పటికీ నటించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గ్లామర్ లేకుండా నటనకు మాత్రమే ప్రాముఖ్యత వున్న కథా పాత్ర అయితే ఖచ్చితంగా నటిస్తానన్నారు. అనవసర విషయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనని పేర్కొన్నారు. చేతినిండా సంపాదించినా కొంతమట్టుకే ఖర్చు చేస్తానని, అనవసర వస్తువులు కొనుగోలు చేయనన్నారు. అధిక ధరలకు వస్తువులు కొనుగోలు చేయనని, పొదుపు పాటించడమే శ్రేయస్కరమని ముగించారీ ముద్దుగుమ్మ. -
ఇక ముందు ఓ లెక్క!
నీట్, హాట్.. ఈ రెండు రకాల పాత్రల్లోనూ చక్కగా ఒదిగిపోతారు త్రిష. అందుకే సినిమాల్లోకొచ్చి పదేళ్లు పైనే అయినా ఆమెకు క్రేజ్ తగ్గలేదు. అయితే, ఇప్పటివరకు ఓ లెక్క.. ఇకముందు ఓ లెక్క అన్నట్లుగా ఉంది త్రిష వ్యవహారం. రెండు డ్యూయెట్లు, ఐదు పది సీన్ల తరహా పాత్రలకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. ఒకవేళ సినిమాలో తన పాత్రకు ఐదే సీన్లున్నా.. అవి ఎంతో శక్తిమంతంగా ఉండాలని, కథకు కీలకంగా ఉంటే చేస్తానని త్రిష పేర్కొన్నారు. పర్టిక్యులర్‌గా ఏదైనా పాత్ర చేయాలని ఉందా? అనే ప్రశ్నకు - ‘‘అలా ఏం లేదు. ప్రతి ఆర్టిస్ట్‌కి ఓ దాహం ఉంటుంది. నటనకు అవకాశం ఉన్న పాత్ర చేసిన ప్రతిసారీ ఆ దాహం తీరుతుంది. ఆ విధంగా చూస్తే, నాకు చాలాసార్లు ఆ సంతృప్తి లభించింది. ఎన్ని పాత్రలు చేసినా ఇంకా చేయడానికి చాలా మిగిలి ఉంటాయి. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా.. అవసరమైతే డీ-గ్లామరస్‌గా కనిపించాలని డిమాండ్ చేసే పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నా. ఒకవేళ ఆర్ట్ మూవీ అయినా సరే రెడీ’’ అంటున్నారు.