గ్లామర్‌ రోల్స్‌కు సై! | Meera Mitun Says Not Averse to Glam Roles | Sakshi
Sakshi News home page

గ్లామర్‌ రోల్స్‌కు సై!

Published Sun, Apr 7 2019 12:10 PM | Last Updated on Sun, Apr 7 2019 12:10 PM

Meera Mitun Says Not Averse to Glam Roles - Sakshi

గ్లామర్‌ అంటే భయపడి పారిపోయే దానిని కానని అంటోంది నటి మీరా మిథున్‌. మోడలింగ్‌ రంగం నుంచి సిల్వర్‌స్క్రీన్‌లో రాణించాలని ఆరాటపడుతున్న బ్యూటీ ఈమె. ఇప్పటికే కోలీవుడ్‌లో రెండు చిత్రాల్లో నటించిన మీరా మిథున్‌ ప్రస్తుతం బోదై ఏరి బుద్ధిమారి అనే చిత్రంలో నటిస్తోంది. సినిమాల్లో నటిస్తున్నా మోడలింగ్‌ను మాత్రం వదలలేదు.

ప్రపంచవ్యాప్తంగా చుట్టేస్తున్న ఈ బ్యూటీ సినిమాల్లోనూ నటిగా గుర్తింపు పొందాలని ఆశిస్తోంది. ఈ సందర్భంగా ఈ అమ్మడు చెప్పిన సంగతులు చూద్దాం. బోదై ఏరి బుద్ధిమారి చిత్రం గురించి చెప్పాలంటే ఇందులో నేను చాలా అర్థవంతమైన పాత్రలో నటిస్తున్నాను. చిత్రం పేరు చూడగానే ఇదేదో మద్యం ఆరోగ్యానికి హానికరం అని సలహా ఇచ్చే కథా చిత్రం అనుకుంటే పప్పులో కాలేసినట్లే.

ఇటీవల తెరపైకి వచ్చిన తడం మాదిరి ఉత్కంఠభరితంగా సాగే థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుంది. ఈ చిత్ర దర్శకుడు ఇంతకు ముందు లఘు చిత్రాలను రూపొందించారు. బోదై ఏరి బుద్ధిమారి చిత్ర కథను చెప్పగానే ఈ పాత్రను నేనే చేయాలనిపించింది. అయితే చిత్రంలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. దీన్ని ఒక చక్కని దృశ్య కావ్యంగా ఛాయాగ్రాహకుడు బాలసుబ్రమణియం తీర్చిదిద్దారు. ఈ చిత్రం కాకుండా మరో మూడు చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయి.

పాత్ర కోసం గుండు కొట్టించుకోవడానికైనా సిద్ధమే. నేను జాతీయ ఉత్తమ నటి అవార్డును పొందాలన్నది మా నాన్న కల. ఆయన ఇప్పుడు లేరు. అయినా ఆ అవార్డును సాధిస్తాను. అలాంటి పాత్రలో నటించే అవకాశం వస్తే పారితోషికం లేకుండా నటించానికి రెడీ. నేను చెన్నై అమ్మాయినే. తమిళ అమ్మాయిలు గ్లామర్‌ అంటేనే చెవులు మూసుకుని పారిపోతారనుకుంటే, మోడలింగ్‌ ప్రపంచంలో లేని గ్లామరా నేను అక్కడి నుంచి వచ్చాను. కాబట్టి నాకు హద్దులు తెలుసు. గ్లామర్‌ అంటే పారిపోను. కథకు అవసరం అయితే అందాలారబోతకు సిద్ధమే అని అంటోంది నటి మీరా మిథున్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement