నటి పూనం బాజ్వా గుర్తుందా? చేవల్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన ఉత్తరాది బ్యూటీ ఈమె. ఆ తరువాత తెనావట్టు తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ కొన్ని చిత్రాల్లో నటించిన పూనం భాజ్వా చాలా గ్యాప్ తరువాత కోలీవుడ్‌లో గురుమూర్తి అనే చిత్రంలో నాయికగా నటించింది. నట్టి నటరాజ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నటి పూనం భాజ్వాని పలకరించగా కొన్ని విషయాలను షేర్ చేసింది. ఎలా సాగుతోంది కేరీర్? కోలీవుడ్ తెరపై చూసి చాలాకాలం అయ్యిందే అన్న ప్రశ్నకు బదులిస్తూ నచ్చిన పాత్రని అంగీకరిస్తున్నట్లు చెప్పింది.
చదవండి: హీరోతో అభ్యంతరకర సీన్.. నా తల్లిదండ్రులకు చెప్పే చేశా: హీరోయిన్
2009లో నటిగా కోలీవుడ్‌కు పరిచయం అయ్యానని, ఇప్పటివరకు కథానాయికగా కొనసాగడం సంతోషంగా ఉందని చెప్పింది. ఎలాంటి పాత్రలో నటించాలని కోరుకుంటున్నారని అడగగా తాను తమిళంలో అన్నీ కుటుంబ కథా చిత్రాల్లోనే నటించాలని, గ్లామర్ పాత్రలో నటించే అవకాశం రాలేదని పేర్కొంది. గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. తనకు ముఖ్యంగా దక్షిణాదిలో అత్యధికంగా ఫేస్‌బుక్ ఫాలోవర్స్ ఉన్నారని చెప్పింది. వారందరూ తన గ్లామరస్ ఫొటోలను ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే అలాంటి ఫొటోలను పోస్ట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
చదవండి: హీరోయిన్‌పై బహిరంగ కామెంట్స్.. నటుడిపై సీరియస్ అయిన చిన్మయి
అయినా గ్లామర్‌కు, స్క్రీన్ షోకు తేడా ఉందని చెప్పింది. తాను పరిధి దాటి ఎప్పుడు స్క్రీన్ షో ప్రదర్శన చేయలేదని చెప్పింది. తనకు నాట్యంలో ప్రవేశం ఉందని, అలాంటి పాత్ర వస్తే చేయాలని ఉందని చెప్పింది. కోలీవుడ్‌లో చాలామంది హీరోల సరసన నటించాలని తెలిపింది. అయితే షూటింగ్ పూర్తి కాగానే వారితో పరిచయాలు పెట్టుకోమని చెప్పింది. అయితే నటుడు జీవా తనకు మంచి మిత్రుడు అని చెప్పి వచ్చింది. ఆయన భార్య కూడా తనతో బాగా మాట్లాడుతుందని భాజ్వా చెప్పింది. అలాగే నటుడు భరత్‌తో కూడా మంచి స్నేహం ఉందని చెప్పింది. కోలీవుడ్లో మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా పూనం భాజ్వా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment