
గ్లామర్ పాత్రలు రావడం లేదు
గ్లామర్‌తోనే మనుగడ అనే నిర్ణయానికి మన హీరోయిన్లు వచ్చేసినట్లు ఉన్నారు. ఇంతకు ముందు నటనకు అవకాశం ఉన్న పాత్రల
తమిళసినిమా : గ్లామర్‌తోనే మనుగడ అనే నిర్ణయానికి మన హీరోయిన్లు వచ్చేసినట్లు ఉన్నారు. ఇంతకు ముందు నటనకు అవకాశం ఉన్న పాత్రల కోసం ఎంత కాలం అయినా వేసి చూస్తామనే మాటలు విన్న వారి నోటి నుంచి ఇప్పుడు అందాలారబోతకు నేను వ్యతిరేకం కాదు అనే వ్యాఖ్యలు వినాల్సి వస్తోంది. అంతగా ఈతరం హీరోయిన్లు మైండ్ సెట్‌ను మార్చుకుంటున్నారు. ఆ మధ్య యువనటి రెజీనా గ్లామర్‌కు నేను దూరం అంటూ మడి కట్టుకు కూర్చుంది.
దీంతో చిత్ర పరిశ్రమ అమ్మడిని పక్కన పెట్టేశాయి. ఇది గ్రహించిన రెజీనా అందాలారబోతకు నేను సైతం సిద్ధమంటూ గేటులెత్తేసింది. తాజాగా నటి స్వాతికి జ్ఞానోదయం అయినట్లుంది. ఈ తెలుగింటి ఆడపడుచుకు ఇప్పటి వరకూ కాస్త మంచి ఇమేజే ఉంది. అయితే అది ఆఫర్లను రాబట్టడం లేదు. స్వాతి చాలా కాలంగా నటిగా కొనసాగుతున్నా ప్రముఖ స్థానాన్ని అందుకోలేకపోయింది. చిన్న చిన్న నాయకులతోనే రొమాన్స్ చేయాల్సి వస్తోంది. అదీ అడపాదడపానే అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. స్వాతి నటించిన తెలుగు చిత్రం త్రిపుర శుక్రవారం తెరపైకి రానుంది.
కొత్త చిత్రం ఏదీ లేదు. తమిళంలో సుబ్రమణిపురం, వడకర్రి, యట్చన్ లాంటి చిత్రాల్లో నటించినా ఇక్కడా ప్రస్తుతం అవకాశాలు నిల్.దీంతో స్వాతి కొత్తరాగం అందుకుంది. నాకు గ్లామర్ పాత్రల అవకాశాలు రావడం లేదు అన్నదే ఆమె తాజా ఆరోపణ. మరీ అసభ్య సన్నివేశాల్లో నటించకూడదన్నది తన పాలసీ. అందుకు తనను ఇప్పటి వరకూ గ్రామీణ యువతి పాత్రలకు పక్కింటి అమ్మాయి ఇమేజ్ పాత్రలకు పరిమితం చేశారు. నవ నాగరీక అమ్మాయి పాత్రలో నటించాలని ఆశగా ఉంది. అందాలారబోతకు తాను వ్యతిరేకిని కాదు. అయితే హద్దులు దాటేవిగా ఉండే గ్లామర్ పాత్రలకు దూరం అని చెప్పింది.