
భద్రాద్రి కొత్తగూడెం, సాక్షి: జిల్లాలో ఓ మహిళ మిస్సింగ్ కేసు కాస్త విషాదాంతం అయ్యింది. కనిపించకుండా పోయిన స్వాతి అనే మహిళ.. ముక్కలై గోనె సంచిలో తేలింది. దృశ్యం సినిమాను తలపించిన ఈ కేసులో ప్రియుడే ఆమెను దారుణంగా హతమార్చగా.. డబ్బే అందుకు ప్రధానకారణమని తేలింది.
జూలూరుపాడు మండలం మాచినేనిపేటకు చెందిన వీరభద్రం.. స్వాతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో వీరభద్రం భార్యతో స్వాతికి గొడవ జరిగింది. ఇందుకు సంబంధించి చుంచుపల్లి పీఎస్‌లో స్వాతిపై కేసు నమోదైంది. అయితే ఈ విచారణలో భాగంగా స్వాతి కోసం పోలీసులు ఆరా తీయగా.. ఆమె కనిపించడం లేదనే విషయం వెలుగు చూసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో వీరభద్రంను విచారించిన జూలూరుపాడు పోలీసులు.. అతని నుంచి పొంతన లేని సమాధానాలు రావడంతో అనుమానం వ్యక్తం చేశారు. తమదైన శైలిలో విచారించగా.. స్వాతిని హతమార్చినట్లు వీరభద్రం నేరం ఒప్పుకున్నాడు. ఈపై ఆమెను చంపి పాతిపెట్టిన గోనె సంచిని తవ్వి తీసి పోలీసులకు అప్పగించాడు.
మొత్తం డబ్బు తనకే ఉండాలని..
గతంలో జూలూరుపాడు మండలానికి చెందిన ఓ జంటకు.. సింగరేణిలో ఉద్యోగాలిప్పిస్తామని స్వాతి నమ్మబలికింది. వాళ్ల దగ్గరి నుంచి రూ.16 లక్షల దాకా వసూలు చేసి వీరభద్రం చేతికి అప్పగించింది. అయితే ఎంతకీ వాళ్ల నుంచి బదులు లేకపోవడంతో ఆ జంట పోలీసులను ఆశ్రయించారు ఆ భార్యభర్తలు. అయినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు ఆత్మహత్య చేసుకుంది. దీంతో.. ఆ డబ్బు మొత్తం తానే అనుభవించాలనే ఉద్దేశంతో స్వాతిని హతమార్చినట్లు వీరభద్రం పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment