అందులో తప్పేముంది? | Kajal Aggarwal is ready to play a negative role | Sakshi
Sakshi News home page

అందులో తప్పేముంది?

Published Tue, Jun 9 2015 2:47 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM

అందులో తప్పేముంది?

అందులో తప్పేముంది?

 వినేవాళ్లుంటే ఎన్నయినా చెబుతారనే నానుడి ఉంది. మన హీరోయిన్ల గ్లామర్ గురించి ఒక్కొక్కరు ఒక్కో కథ చెబుతుంటారు. కొందరు గ్లామర్‌కు దూరమంటారు. మరికొందరు దేనికయినా హద్దులుంటాయంటారు. ఇంకొందరు గ్లామర్‌గా నటిస్తే తప్పేంటి? అని ఎదురు ప్రశ్న వేస్తారు. ఇక నటి కాజల్ అగర్వాల్ అయితే అదేమయినా పెద్ద నేరమా? అంటున్నారు. నిజం చెప్పాలంటే ఇలాంటి వాళ్లంతా గ్లామర్‌ను నమ్ముకున్నవాళ్లే అని చెప్పొచ్చు. ఒకటీఅరా చిత్రాల్లో అభినయంతో కూడిన పాత్రలు చేసినా తారకమంత్రం మాత్రం అందాలారబోతే.
 
  అందుకే గ్లామర్‌ను వెనుకేసుకొస్తారు. ఇంతకుముందు వరకు తన మేకప్ మెరుగులతో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూ వచ్చిన ఈ అమ్మడి అందాలు వారికి మొహమొత్తినట్లుంది. లేదా టాలీవుడ్‌కే బోర్ కొట్టినట్లుంది. ఏదేమైనా మొత్తానికి ఈ భామకు అక్కడ అవకాశాలు కరువయ్యాయి. దీంతో అమ్మడి దృష్టంతా కోలీవుడ్ పైనే పెట్టింది. ఇక్కడ కూడా తన అందాలనే నమ్ముకున్నారనే ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న చిత్రాల్లో అందాలారబోతలతో మోతెక్కిస్తున్నారట.
 
 దీనిగురించి అడిగినవాళ్లతో గ్లామర్‌గా నటించడం పెద్ద నేరమా? అభిమానులు గ్లామర్‌ను కోరుకుంటున్నారు. వారిని సంతోషపెట్టడానికి మేము గ్లామర్‌గా నటిస్తున్నాం. దాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తాను ధనుష్‌తో నటిస్తున్న మారి, విశాల్‌కు జంటగా చేస్తున్న పాయంపులి చిత్రాలు అభిమానులు తనపై నమ్మకాన్ని పెంచుతాయనే విశ్వాసాన్ని కాజల్‌అగర్వాల్ వ్యక్తం చేశారు. ఈ రెండు చిత్రాలు మినహా అమ్మడికి వేరే అవకాశాలు లేవన్నది గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement