సోషల్ మీడియాలో ఆమె ఫొటో కనిపిస్తే చాలు.. సెకనుకో లైక్, కామెంట్, షేర్. ఇప్పుడు వెబ్ స్క్రీన్ మీదా తన చరిష్మా చూపిస్తోంది ఈ టాప్ మోడల్.
►పుట్టింది, పెరిగింది, చదివింది అంతా ఢిల్లీలోనే.
►చిన్నప్పుడు సింగర్, చదువుకునేప్పుడు మోడల్, చదువు పూర్తయ్యాక నటి.. ఇలా ఒక్కో దశలో ఒక్కో కెరీర్‌ను ఎంచుకుంది కరిష్మా.
►కాలేజీ రోజుల్లో చాలామంది తన శరీరాకృతిని, అందాన్ని ప్రశంసిస్తూండడంతో మోడల్ అవ్వాలని ముంబై చేరింది. కొద్ది రోజుల్లోనే బోల్డ్ అండ్ బిజీ మోడల్‌గా మారిపోయింది.
►ఆమెలోని అభినయ కళను గ్రహించిన స్మాల్ స్క్రీన్... సీరియల్స్‌లో అవకాశాలను ఇచ్చింది.
►‘ప్యార్ తూనే క్యా కియా’తో పరిచయమై వరుసగా ‘పవిత్ర్ రిష్తా’, ‘లవ్ బై ఛాన్స్’, ‘యే హై మొహబ్బత్’, ‘ఫియర్ ఫైల్స్’ లోనూ నటించింది.
►ఆ సీరియల్స్, సినిమా చాన్స్‌లను తెచ్చి పెట్టాయి. ‘ప్యార్ కా పంచనామా– 2’ తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ‘సూపర్ –30’ వంటి పలు సినిమాల్లోనూ మెరిసింది.
►‘లైఫ్ సహీ హై’ సిరీస్‌తో వెబ్ దునియాలోకి అడుగుపెట్టి ‘రాగిణి ఎమ్‌ఎమ్‌ఎస్: రిటర్న్స్’, ‘హమ్’, ‘ఫిక్సర్’లతో అలరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment