
ఫండే మ్యాగజిన్
బాలీవుడ్ నటి ఆలియా భట్
ఒక్కొక్కరికి ఒక్కో ముద్దుపేరు ఉండటం సహజం. వారి ప్రవర్తనతో గానీ, అలవాట్లు.. ఇష్టాలతోగానీ, కనిపించే తీరుతోగానీ.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. చాలా రకాలుగా మారుపేర్లు, ముద్దుపేర్లు వస్తూంటాయి. కొన్ని ముద్దు పేర్లు మాత్రం స్థిరపడిపోతాయి కూడా. ఇలాగే ప్రముఖ బాలీవుడ్ నటి అయినటువంటి ఆలియా భట్‌కి కూడా ఓ చిన్న కథ ఉంది. అదేంటో చూద్దామా!
ఆలియా భట్.. మగవాళ్ల కోసం తయారుచేసిన డియోడరెంట్స్‌ని వాడుతుందని బాలీవుడ్‌లో చెవులు కొరుక్కుంటారట. అది సరే.. ఆలియాను ఆమె ఫ్రెండ్స్ ప్రేమగా.. ఇంటోవాళ్లు్ల ముద్దుగా ఆలూ అని పిలుచుకుంటారని ఆమె అభిమానులకు తెలిసే ఉంటుంది. అయితే ఆలియా నుంచి ఆలూ అని రాలేదట. ఆమె చిన్నప్పుడు చబ్బీ చబ్బీగా ఉండటం వల్ల వాళ్లమ్మ సోనీ రాజ్‌దాన్ ‘ఆలూ’ అని పిలవడం మొదలుపెట్టిందట. తర్వాత అదే ముద్దు పేరుగా సెట్ అయిపోయిందని మూవీ వెబ్‌సైట్స్ ఇన్‌ఫో!
Comments
Please login to add a commentAdd a comment