nick name
-
Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్‌లో కొత్త పోకడ
చన్నీ, బిట్టు, పప్పీ, టీనూ, కాకా, షెర్రీ, రాజా, రింకూ, మీత్. ముద్దు పేర్లు భలే ఉన్నాయి కదా! ఎన్నికల వేళ పంజాబ్‌లో జనం నోట నానుతున్న పేర్లివి. రాష్ట్రం నుంచి లోక్‌సభ బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లు పొడవుగా ఉన్నాయి. పూర్తి పేరు పలకడమే ఇబ్బంది. అందుకే నినాదాలకు, పదేపదే పిలుచుకోవడానికి క్యాచీగా, సులభంగా గుర్తు పెట్టుకోగలిగేలా ముద్దు పేర్లను వాడుతున్నారు! జలంధర్‌లో చన్నీ.. పంజాబ్ మాజీ సీఎం, జలంధర్ కాంగ్రెస్ అభ్యర్థి చరణ్‌జిత్ సింగ్ అందరికీ ‘చన్నీ’గానే తెలుసు. అందుకే ‘జలంధర్ షహర్.. చన్నీ దీ లెహర్’ (జలంధర్ నగరంలో చన్నీ తరంగం) అంటూ హోరెత్తిస్తున్నారు. ఇక్కడి ఆప్ అభ్యర్థి పవన్ కుమార్ ‘టీనూ’ కోసం ‘సాద టీను.. జలంధర్ దా టీను’ (మన టీనూ.. జలంధర్ టీనూ) అంటూ వైరల్ చేస్తున్నారు. లుధియానా కాంగ్రెస్ అభ్యర్థిగా పంజాబ్ పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ ‘రాజా’ బరిలో ఉన్నారు. ఆయన కోసం ‘తుహాదా రాజా.. తుహాదే సంగ్’ (మీ రాజా మీతోనే) అనే స్లోగన్ తయారు చేశారు. స్థానిక ఎమ్మెల్యే అశోక్ పరాషర్ ‘పప్పీ’ ఆప్ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఎంపీ రవ్నీత్ సింగ్ ‘బిట్టూ’ బరిలో ఉన్నారు. ‘బిట్టు తే రాజా గప్పీ.. జిట్టుగా సడ్డా పప్పీ’ (బిట్టు ఫూలవడం.. పప్పీ గెలవడం ఖాయం ) అని ఆప్, ‘బిట్టూ దే నాల్.. లుధియానా ఖుష్హాల్’ (బిట్టు చాలు లుధియానా అంతా ఆనందాలు) అని బీజేపీ హోరెత్తిస్తున్నాయి. సంగ్రూర్ నుంచి మంత్రి గుర్మీత్ సింగ్ ‘మీత్’ ఆప్ అభ్యరి్థగా నిలబడ్డారు. ‘జిత్తేగా మీత్.. జిత్తేగా సంగ్రూర్’ (మీత్ గెలుస్తారు.. సంగ్రూర్ గెలుస్తుంది) అని ఆయన అనుచరులు వైరల్ చేస్తున్నారు. ఫిరోజ్‌పూర్ నుంచి ఆప్ అభ్యర్థి జగ్దీప్సింగ్ బ్రార్ బరిలో ఉన్నారు. ఆయన ఫేస్బుక్లో ‘కాకా బ్రార్.. ఫర్ ఫిరోజ్‌పూర్’ హ్యాష్‌టాగ్‌తో మద్దతుదారులు నినాదాలిస్తున్నారు. గురుదాస్‌పూర్ నుంచి ఆప్ అభ్యర్థిగా అమన్ షేర్ ‘షెర్రీ’ కల్సీ పోటీ చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Hrithik Roshan: ఈ బాలీవుడ్ యాక్టర్ ముద్దు పేరు వింటే షాకే..!
ఒక్కొక్కరికి ఒక్కో ముద్దుపేరు ఉండటం సహజం. వారి ప్రవర్తనతో గానీ, అలవాట్లు.. ఇష్టాలతోగానీ, కనిపించే తీరుతోగానీ.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. చాలా రకాలుగా మారుపేర్లు, ముద్దుపేర్లు వస్తూంటాయి. కొన్ని ముద్దు పేర్లు మాత్రం స్థిరపడిపోతాయి కూడా. ఇలాగే ప్రముఖ బాలీవుడ్ నటుడు అయినటువంటి హృతిక్ రోషన్‌కి కూడా ఓ చిన్న కథ ఉంది. అదేంటో చూద్దామా! బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ పెట్ నేమ్ దుగ్గూ. ఈ ముద్దు పేరుకీ.. హృతిక్ వాళ్ల నాన్న.. బాలీవుడ్ ఒకప్పటి అందాల హీరో రాకేశ్ రోషన్ పెట్ నేమ్కీ ఏదో కనెక్షన్ ఉండే ఉంటదని బాలీవుడ్ వర్గాలు.. తన పేరునే కాస్త తిరగేసే కొడుకును పిలుచుకుంటున్నాడా ఏంటీ అని హృతిక్ ఫ్యాన్స్ డౌట్ పడతారట. ఇంతకీ రాకేశ్ రోషన్ ముద్దు పేరేంటంటే.. గుడ్డూ! ఇవి చదవండి: ఈ కొరియన్ ఖవ్వాలీ విన్నారో.. వహ్వా వహ్వా..! అనక తప్పదు! -
Alia Bhatt: తనకు 'ఆలూ' అనే ముద్దు పేరు ఎలా వచ్చిందో తెలుసా!
ఒక్కొక్కరికి ఒక్కో ముద్దుపేరు ఉండటం సహజం. వారి ప్రవర్తనతో గానీ, అలవాట్లు.. ఇష్టాలతోగానీ, కనిపించే తీరుతోగానీ.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. చాలా రకాలుగా మారుపేర్లు, ముద్దుపేర్లు వస్తూంటాయి. కొన్ని ముద్దు పేర్లు మాత్రం స్థిరపడిపోతాయి కూడా. ఇలాగే ప్రముఖ బాలీవుడ్ నటి అయినటువంటి ఆలియా భట్‌కి కూడా ఓ చిన్న కథ ఉంది. అదేంటో చూద్దామా! ఆలియా భట్.. మగవాళ్ల కోసం తయారుచేసిన డియోడరెంట్స్ని వాడుతుందని బాలీవుడ్లో చెవులు కొరుక్కుంటారట. అది సరే.. ఆలియాను ఆమె ఫ్రెండ్స్ ప్రేమగా.. ఇంటోవాళ్లు్ల ముద్దుగా ఆలూ అని పిలుచుకుంటారని ఆమె అభిమానులకు తెలిసే ఉంటుంది. అయితే ఆలియా నుంచి ఆలూ అని రాలేదట. ఆమె చిన్నప్పుడు చబ్బీ చబ్బీగా ఉండటం వల్ల వాళ్లమ్మ సోనీ రాజ్దాన్ ‘ఆలూ’ అని పిలవడం మొదలుపెట్టిందట. తర్వాత అదే ముద్దు పేరుగా సెట్ అయిపోయిందని మూవీ వెబ్‌సైట్స్ ఇన్ఫో! ఇవి చదవండి: పద్నాలుగేళ్ల వయసులోనే దేశాధ్యక్షుడు -
గిల్‌కు కొత్త పేరు పెట్టిన టీమిండియా దిగ్గజం
టీమిండియా యువ సంచలనం శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం అద్బుత ఫామ్‌లో ఉన్నాడు. హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీతో మెరిసిన గిల్.. రెండో వన్డేలోనూ 40 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ను ఆడి జట్టును గెలిపించాడు. దీంతో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక తన ఇన్నింగ్స్‌లతో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో పడిన గిల్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రెండో వన్డే సందర్భంగా సునీల్ గావస్కర్ మ్యాచ్ కామెంటరీలో పాల్గొన్నాడు. లైవ్ జరుగుతున్న సమయంలోనే శుబ్‌మన్ గిల్‌కు గావస్కర్ కొత్త పేరును ప్రతిపాదిస్తున్నట్లు అడిగాడు. 'గిల్ నీకు ఒక నిక్‌నేమ్ పెడుతున్నా.. అదేంటో తెలుసా.. 'స్మూత్మాన్ గిల్'.. నీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా అంటూ కామెంట్ చేశాడు. కాగా గావస్కర్ కామెంట్‌పై గిల్ వెంటనే స్పందించాడు. ''అలా ఏం లేదు సార్.. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. ఇక తొలి వన్డేలో డబుల్ సెంచరీతో మెరిసిన శుబ్‌మన్ గిల్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. టీమిండియా నుంచి వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. టీమిండియా తరపున డబుల్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఇక 19 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన గిల్ టీమిండియా తరపున వన్డేల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. చదవండి: 'టీమిండియా రైట్ ట్రాక్‌లోనే వెళ్తుందా?'.. మీకేమైనా అనుమానమా! 'నాకు నచ్చలేదు.. బయోపిక్ నుంచి తప్పుకుంటున్నా' -
రష్మిక మందన్నాను ఇంట్లో ఏమని పిలుస్తారో తెలుసా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. విజయ్‌తో ఆమె నటించిన వారసుడు, అలాగే బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రాతో నటించిన `మిషన్ మజ్ను`సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో క్షణం తీరికలేకుండా గడిపేస్తుంది రష్మిక. రీసెంట్గా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన ఈ భామ ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో మిమ్మల్ని ఇంట్లో ఏమని పిలుస్తారు అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. తనను మోనీ లేదా మోవా అని పిలుస్తారని చెప్పుకొచ్చింది రష్మిక. మోవా అంటే కూతురు అనే అర్థమట. ఇదిలా ఉంటే రష్మిక, అల్లు అర్జున్ కాంబినేషన్లో త్వరలోనే పుష్ప-2 షూటింగ్ ప్రారంభం కానుంది. -
ఆర్ఆర్ఆర్ మేనియా: ఆనంద్ మహీంద్ర కొత్త కారు నిక్‌నేమ్ ‘భీమ్’కే ఓటు
సాక్షి,ముంబై: మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్ర తన స్కార్పియో-ఎన్ కారుకి మంచి పేరు కావాలంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్‌కు నెటిజన్ల స్పందన బాగానే వచ్చింది. అయితే మళ్లీ ఆనంద్ మహీంద్ర మళ్లీ డైలమాలో పడ్డారు. వచ్చిన సూచనల్లో రెండు నిక్‌నేమ్స్‌ను సెలక్ట్ చేసుకున్నారు. అయితే వీటిల్లో దేన్ని ఫైనల్ చేయాలో తోచక మళ్లీ ఫ్యాన్స్‌నే ఆశ్రయించారు. (బిగ్ డే..మంచి పేరు కావాలి.. చెప్పండబ్బా: ఆనంద్ మహీంద్రా) కొత్త స్కార్పియో-ఎన్ అనే నిక్‌నేమ్స్ వరదలా వచ్చాయి. ఇందుకు అందరికీ ధన్యవాదాలు. వచ్చని వాటిల్లో రెండింటిని షార్ట్‌లిస్ట్ చేసాను. భీమ్, బిచ్చూ అనే రెండు పేర్లలో మీ ఓటు దేనికి అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఇప్పటికే 25వేలకు పైగా స్పందనలొచ్చాయి. విశేషం ఏమిటంటే చాలామంది ‘భీమ్’ కే ఓటు వేస్తుండటం. భీమ్ ఈజ్ సింబల్ ఆఫ్ కింగ్.. స్కార్పియోకి అదే బాగా సూట్ అవుతుంది.. పలకడం కూడా ఈజీ అంటూ చాలామంది కమెంట్ చేశారు. Thank you all for the flood of suggestions for the nickname of my new Scorpio-N. I’ve shortlisted two. Here’s the final shoot-out between them. Need your verdict. — anand mahindra (@anandmahindra) October 8, 2022 Bheem ☑️ pic.twitter.com/Hf9BG0rnx2 — 🇩 🇻 🇸 #NTR30⚓ (@venkateshDUGUTA) October 8, 2022 BHEEM pic.twitter.com/5HwcaywfrL — Bellamkonda's (@kotiGowd9999) October 8, 2022 Bheem is the symbol of King. — Shweta Sinha (@gudiasinha) October 8, 2022 #Bheem pic.twitter.com/WFgUxyrL8p — nikhil reddy (@MuskuNikhil) October 8, 2022 -
పిల్లల నామధ్యేయం.. కొత్తధనం
ఓ 30 లేదా 40 ఏళ్లు వెనక్కి వెళ్లండి. మన ముందు తరాల వారి పేర్లన్నీ గ్రామదేవతలు, కులదైవాలు కలిసొచ్చేలా ఉండేవి. ఇప్పుడలా కాదు.. నవతరం తల్లిదండ్రులు తమ పిల్లలకు పేర్లు పెట్టడానికి ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తున్నారు. అందుకే పుస్తకాలు, ఇంటర్నెట్లో అన్ని రకాలుగా వడపోత పట్టి మరీ పేర్లు వెతుకుతున్నారు. పేరు పలకడానికి సులువుగా, వినసొంపుగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అందుకే నామకరణం చేసేటప్పుడు అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. నక్షత్రం, ఇష్టదైవం, అభిరుచి, తదితర అంశాల ఆధారంగా ఉత్తమ పేరు ఎంచుకుంటున్నారు. తక్కువ అక్షరాలు, అర్థవంతమైన వాటితో నామకరణం చేస్తున్నారు. ‘మీ అబ్బాయా..’ ‘మీ అమ్మాయా..’ ‘ఏం పేరు..?’ ‘మీ పిల్లల్లాగే పేర్లూ ముద్దు ముద్దుగా ఉన్నాయి..’ అని ఎవరైనా అంటే ఆ క్షణం తల్లిదండ్రులు సంబరపడిపోతున్నారు. సాక్షి, వెలిగండ్ల: సాధారణంగా పుట్టిన పాప.. బాబుకు పేరు పెట్టడానికి 21 రోజులకు నామకరణ మహోత్సవం నిర్వహిస్తారు. వీలుకానివారు 3వ నెలలో ఆ కార్యక్రమం చేస్తారు. జన్మ నక్షత్రం, ఇష్టదైవం, పూరీ్వకులు, ప్రదేశాల ప్రాధాన్యత ఆధారంగా తమ అభిరుచికి అనుగుణంగా తల్లిదండ్రులు పేరు ఎంపిక చేస్తున్నారు. నామకరణ మహోత్సవం రోజున పాప చెవి వద్ద ఆ పేరుతో పిలవడం ఆనవాయితీగా వస్తోంది. పూర్వీకులు, దేవుళ్లు, సినీ నటులు గతంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. తల్లిదండ్రులు, తాత, ముత్తాతలు అంటే అపారమైన భక్తి, గౌరవం, ప్రేమ. వారి మరణానంతరం కుటుంబంలోని వారికి సంతానం కలిగితే తమ పూర్వీకులే మళ్లీ పుట్టారని భావించి వారి పేరే పెట్టేవారు. మరికొందరు తమ ఇష్టదైవం పేరు పెట్టడానికి ఆసక్తిచూపేవారు. సంతానం కలిగితే ‘స్వామి.. మీ పేరు పెట్టుకుంటాం..’ అని తల్లిదండ్రులు ముందే మొక్కుకుని పిల్లలు కలిగాక దేవుని పేరు పెట్టేవారు. దేశభక్తి మెండుగా ఉన్నవారు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన నేతల పేర్లను తమ పిల్లలు, మనుమలు, మనుమరాళ్లకు పెట్టడం గర్వంగా భావించేవారు. ఇంకొందరు తమ అభిమాన సినీ నటులు పేర్లు పిల్లలకు పెట్టి మురిసిపోతుంటారు. అంతటివారు కావాలని కోరుకునేవారు. ఈ పేర్లన్నీ దాదాపు పొడవుగా(అక్షరాలు ఎక్కువగా) ఉండేవి. మారుతున్న దృక్పథం క్రమేణా పాత సంప్రదాయం కనుమరుగైంది. కట్టూబొట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. పిల్లలకు పెట్టే పేరులోనూ ఆధునికత కనిపించేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు లేదా మూడు అక్షరాలు కలిగిన పేర్లు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముద్దు పేర్లు పేరుతో కాకుండా పిల్లలను ముద్దుపేరుతో పిలవడం ఇటీవల కాలంలో సాధారణమైంది. ఇదీ ప్రతి ఇంటిలోనూ కనిపిస్తోంది. మిన్ని, బన్ని, డాలి, హనీ, బబ్లూ, పింకూ, చింటు, టింకు, చిన్న, పింకి, యాపిల్, చెర్రీ, సన్నీ, అమ్ములు, ఫ్రూటీ తదితర పేర్లు మనకు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. -
కూతురికి కరోనా పేరు పెట్టిన ఎంపీ!
కోలకతా: కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం పోరాడుతోంది. అగ్రరాజ్యంతో సహా అన్ని దేశాలను ఒక చిన్న కరోనా వైరస్ వణికిస్తోంది. పోరాటం అంటే ఏంటో తెలిసేలా చేస్తోంది. చేతులు కడుక్కునే సంప్రదాయాన్ని, శుభ్రంగా ఉండే అలవాట్లను కూడా మరో వైపు ప్రపంచానికి తెలియజేస్తోంది. దీంతో చాలా మంది వారికి పుట్టిన నవ శిశువులకు కరోనా, కోవిడ్, లాక్డౌన్ అంటూ వివిధ రకాల పేర్లు పెడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి తృణమూల్ కాంగ్రెస్ ఆరమ్ బాగ్ ఎంపీ అపరూప పొద్దార్ కూడా చేరారు. కరోనా లాక్డౌన్ కాలంలోనే అపరూప ఒక పాపకి జన్మనిచ్చారు. అయితే కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం పోరాడుతోన్న ఈ క్లిష్ట సమయంలో తమ కూతురు జన్మించిందని అందుకే తనకి కరోనా అని ముద్దుపేరు పెట్టినట్లు అపరూప దంపతులు తెలిపారు. అయితే బెంగాలో నూతనంగా జన్మించిన శిశువుకు రెండు పేర్లు పెట్టే సంప్రదాయం ఉంది. ఒకటి తల్లిదండ్రులు తమకి నచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. రెండవది మాత్రం ఆ ఇంటి పెద్ద నిర్ణయిస్తారు. అయితే తమ పాపకి అధికారిక పేరును మాత్రం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెడతారని అపరూప తెలిపారు. ఇలా కరోనాకి సంబంధించిన పేర్లు తమ పిల్లలకి పెట్టడం ఇది మొదటిసారి ఏం కాదు. ఇది వరకే మధ్యప్రదేశ్‌లో ఒక జంట తమ కుమారుడికి లాక్డౌన్ అని పేరు పెట్టగా, ఉత్తరప్రదేశ్‌లో ఒక శిశువు శానిటైజర్ అని పేరు పెట్టారు. (దీదీ పంతం : కేంద్రం ఘాటు లేఖ) -
అందుకు చాలా కష్టపడ్డాను: నటుడు
కొంతమందికి ముద్దుపేర్లంటే మహా సరదా. అయితే కొందరు నిక్‌నేమ్స్‌తో పిలిపించుకోవడం కన్నా ఎదుటివారిని ఆ పేర్లతో పిలవడానికే ఎక్కువ ఇష్టపడుతారు. ఇక సినీ ప్రముఖులను అభిమానులు బోలెడు పేర్లతో పిలుచుకుంటారు. కొంతమంది అప్పటికే తమకున్న నిక్‌నేమ్స్ బయట పెట్టి వాటితోనే చలామణీ అవుతుంటారు. ఇంతకీ విషయమేంటంటే.. బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషికపూర్‌కు ముద్దుపేర్లు అదే.. నిక్‌నేమ్స్ అంటే చెప్పలేనంత చిరాకట. ఈ విషయాన్ని ఆయన ట్విటర్లో పంచుకున్నాడు. చింటూ అని రాసి ఉన్న టోపీ ధరించిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. చింటూ అనే పేరు నుంచి తిరిగి రిషికపూర్ అని పిలిపించుకోడానికి ఎంత కష్టపడ్డానో అంటూ రాసుకొచ్చాడు. ‘బాల్యంలో నా సోదరుడు రణధీర్ కపూర్ చింటూ అన్న పేరుతో నన్ను ఏడిపించేవాడు. అయితే తిరిగి నా పేరును సంపాదించుకోడానికి చాలా శ్రమించాను. ఎప్పటికైనా రిషికపూర్ పేరుతో పిలిపించుకోవాలని మనసులో బలంగా అనుకునేవాడిని’ అని రిషికపూర్ పేర్కొన్నాడు. అదే విధంగా తల్లిదండ్రులెవరూ పిల్లలకు నిక్‌నేమ్స్ పెట్టి మీ సృజనాత్మకతను చూపించుకోకండి అంటూ ఉచిత సలహా ఇచ్చాడు. తన పిల్లలు రణబీర్ కపూర్, రిధిమా కపూర్లను యథాతథంగా పిలిచానే తప్పితే ఎలాంటి నిక్‌నేమ్స్ పెట్టలేదని పేర్కొన్నాడు. దీనికి నెటిజన్లు పాజిటివ్‌గా స్పందించారు. నిజంగానే ‘రిషికపూర్’ అన్న పేరు రావటానికి ఎంతగానో కష్టపడ్డారు అంటూ పొగడ్తలు కురిపించారు. సుమారు 11 నెలల తర్వాత రిషికపూర్ కేన్సర్ చికిత్స పూర్తి చేసుకొని ఈ మధ్యే న్యూయార్క్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. Worked very hard to get Rishi Kapoor back as my name! Parents must never nick name a child. I never did. — Rishi Kapoor (@chintskap) December 4, 2019 -
ఇషాంత్‌ను ఆటపట్టించిన సెహ్వాగ్ ట్వీట్
టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ వరుస ట్వీట్లతో తన ఫాలోయర్స్ ను అలరిస్తున్నాడు. క్రికెట్ నుంచి రిటైరయ్యాక.. మైదానంలో బౌలర్లపైనే కాదు సోషల్ మీడియాలోనూ దూకుడుగా ఉంటాడని వీరూ నిరూపించాడు. విషయం ఏంటంటే.. శుక్రవారం(సెప్టెంబర్ 2న) టీమిండియా ఆటగాడు ఇషాంత్ శర్మ పుట్టినరోజు. ట్విట్టర్ ద్వారా ఇషాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. అయితే వీరూ తన ట్వీట్ లో ఇషాంత్‌కు కొత్త నిక్ నేమ్ పెట్టాడు. టీమిండియా జట్టులో ఇషాంత్ ఎత్తయిన ఆటగాడు కావడంతో ప్రపంచంలో ఎత్తైయిన నిర్మాణాలలో ఒకటైన బూర్జ్ ఖలీఫాతో పోల్చాడు. బాల్ వాలే బూర్జ్ ఖలీఫా, శర్మాజీకా లడ్కా అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్ లో ఆటపట్టించాడు. ఇషాంత్ ను ఎంపిక చేసుకుంటే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉంటారని సెహ్వాగ్ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు. Hpy Bdy #BaalWaaleBurjKhalifa @ImIshant Sharma,the best #SharmajiKaLadka ,jiske selection Se everyone is super happy pic.twitter.com/XB3rTxQMJA — Virender Sehwag (@virendersehwag) 2 September 2016