టీమిండియా యువ సంచలనం శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం అద్బుత ఫామ్‌లో ఉన్నాడు. హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీతో మెరిసిన గిల్.. రెండో వన్డేలోనూ 40 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ను ఆడి జట్టును గెలిపించాడు. దీంతో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక తన ఇన్నింగ్స్‌లతో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో పడిన గిల్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
రెండో వన్డే సందర్భంగా సునీల్ గావస్కర్ మ్యాచ్ కామెంటరీలో పాల్గొన్నాడు. లైవ్ జరుగుతున్న సమయంలోనే శుబ్‌మన్ గిల్‌కు గావస్కర్ కొత్త పేరును ప్రతిపాదిస్తున్నట్లు అడిగాడు. 'గిల్ నీకు ఒక నిక్‌నేమ్ పెడుతున్నా.. అదేంటో తెలుసా.. 'స్మూత్‌మాన్ గిల్'.. నీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా అంటూ కామెంట్ చేశాడు. కాగా గావస్కర్ కామెంట్‌పై గిల్ వెంటనే స్పందించాడు. ''అలా ఏం లేదు సార్.. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు.
ఇక తొలి వన్డేలో డబుల్ సెంచరీతో మెరిసిన శుబ్‌మన్ గిల్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. టీమిండియా నుంచి వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. టీమిండియా తరపున డబుల్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఇక 19 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన గిల్ టీమిండియా తరపున వన్డేల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.
చదవండి: 'టీమిండియా రైట్ ట్రాక్‌లోనే వెళ్తుందా?'.. మీకేమైనా అనుమానమా!
Comments
Please login to add a commentAdd a comment