కోలకతా: కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం పోరాడుతోంది. అగ్రరాజ్యంతో సహా అన్ని దేశాలను ఒక చిన్న కరోనా వైరస్ వణికిస్తోంది. పోరాటం అంటే ఏంటో తెలిసేలా చేస్తోంది. చేతులు కడుక్కునే సంప్రదాయాన్ని, శుభ్రంగా ఉండే అలవాట్లను కూడా మరో వైపు ప్రపంచానికి తెలియజేస్తోంది. దీంతో చాలా మంది వారికి పుట్టిన నవ శిశువులకు కరోనా, కోవిడ్, లాక్‌డౌన్ అంటూ వివిధ రకాల పేర్లు పెడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి తృణమూల్ కాంగ్రెస్ ఆరమ్ బాగ్ ఎంపీ అపరూప పొద్దార్ కూడా చేరారు.
కరోనా లాక్‌డౌన్ కాలంలోనే అపరూప ఒక పాపకి జన్మనిచ్చారు. అయితే కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం పోరాడుతోన్న ఈ క్లిష్ట సమయంలో తమ కూతురు జన్మించిందని అందుకే తనకి కరోనా అని ముద్దుపేరు పెట్టినట్లు అపరూప దంపతులు తెలిపారు. అయితే బెంగాలో నూతనంగా జన్మించిన శిశువుకు రెండు పేర్లు పెట్టే సంప్రదాయం ఉంది. ఒకటి తల్లిదండ్రులు తమకి నచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. రెండవది మాత్రం ఆ ఇంటి పెద్ద నిర్ణయిస్తారు. అయితే తమ పాపకి అధికారిక పేరును మాత్రం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెడతారని అపరూప తెలిపారు. ఇలా కరోనాకి సంబంధించిన పేర్లు తమ పిల్లలకి పెట్టడం ఇది మొదటిసారి ఏం కాదు. ఇది వరకే మధ్యప్రదేశ్‌లో ఒక జంట తమ కుమారుడికి లాక్‌డౌన్ అని పేరు పెట్టగా, ఉత్తరప్రదేశ్‌లో ఒక శిశువు శానిటైజర్ అని పేరు పెట్టారు. (దీదీ పంతం : కేంద్రం ఘాటు లేఖ)
Comments
Please login to add a commentAdd a comment