Keerthy Suresh Ups Her Glamour Dose For Upcoming Movies - Sakshi
Sakshi News home page

Keerthy Suresh : స్విమ్‌సూట్‌లో ఫోటోలు పోస్ట్‌ చేసిన కీర్తి సురేష్‌.. 'అవసరమా మహానటి'?

Published Fri, Jan 13 2023 10:09 AM | Last Updated on Fri, Jan 13 2023 11:38 AM

Keerthy Suresh Ups Her Glamour Dose For Upcoming Movies - Sakshi

తమిళసినిమా: నటి కీర్తి సురేష్‌ అతి తక్కువ కాలంలోనే మహానటి చిత్రంలో సావిత్రిగా జీవించి జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. తర్వాత తమిళంలో సాని కాగితం అనే చిత్రంలో లైంగికదాడికి గురై ప్రతీకారేచ్ఛతో రగిలే యువతిగా నటించి ప్రశంసలు అందుకుంది. అదేవిధంగా కొన్ని హీరోయిన్‌ సెంట్రింగ్‌ కథా పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఆ చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేదు. దీంతో కీర్తిసురేష్‌ ఇప్పుడు పూర్తిగా గ్లామర్‌పై దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. కారణం అవకాశాలు తగ్గడమే అని ప్రచారం జరుగుతోంది.

తెలుగులో చిరంజీవికి చెల్లెలుగా బోలాశంకర్‌ చిత్రంలో, నానికి జంటగా దసరా చిత్రంలో నటిస్తోంది. వీటిలో దసరా చిత్రం షూటింగ్‌ పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇకపోతే తమిళ్‌లోను శివకార్తికేయన్‌కు జంటగా నటించిన మావీరన్‌ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. అదేవిధంగా ఉదయనిధి స్టాలిన్‌ సరసన నటించిన మామన్నన్‌ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. దీంతో కీర్తిసురేష్‌ కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇటీవల ఈమె తరచూ తన గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు థాయిలాండ్‌లో విహారయాత్ర చేస్తోంది. అక్కడ బికినీ దుస్తుల్లో దిగిన ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. కీర్తిసురేష్‌ హాట్‌నెస్‌ ఓవర్‌ లోడ్‌ కీర్తి వేరే లెవెల్‌ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరైతే కీర్తి ఇలాంటివి నీకు సరిపడవు. పాత కీర్తిలా ఉంటేనే బాగుంటావు అంటూ సూచనలు ఇస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement