ఇక ముందు ఓ లెక్క!
నీట్, హాట్.. ఈ రెండు రకాల పాత్రల్లోనూ చక్కగా ఒదిగిపోతారు త్రిష. అందుకే సినిమాల్లోకొచ్చి పదేళ్లు పైనే అయినా ఆమెకు క్రేజ్ తగ్గలేదు. అయితే, ఇప్పటివరకు ఓ లెక్క.. ఇకముందు ఓ లెక్క అన్నట్లుగా ఉంది త్రిష వ్యవహారం. రెండు డ్యూయెట్లు, ఐదు పది సీన్ల తరహా పాత్రలకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. ఒకవేళ సినిమాలో తన పాత్రకు ఐదే సీన్లున్నా.. అవి ఎంతో శక్తిమంతంగా ఉండాలని, కథకు కీలకంగా ఉంటే చేస్తానని త్రిష పేర్కొన్నారు.
పర్టిక్యులర్‌గా ఏదైనా పాత్ర చేయాలని ఉందా? అనే ప్రశ్నకు - ‘‘అలా ఏం లేదు. ప్రతి ఆర్టిస్ట్‌కి ఓ దాహం ఉంటుంది. నటనకు అవకాశం ఉన్న పాత్ర చేసిన ప్రతిసారీ ఆ దాహం తీరుతుంది. ఆ విధంగా చూస్తే, నాకు చాలాసార్లు ఆ సంతృప్తి లభించింది. ఎన్ని పాత్రలు చేసినా ఇంకా చేయడానికి చాలా మిగిలి ఉంటాయి. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా.. అవసరమైతే డీ-గ్లామరస్‌గా కనిపించాలని డిమాండ్ చేసే పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నా. ఒకవేళ ఆర్ట్ మూవీ అయినా సరే రెడీ’’ అంటున్నారు.