ఇక గ్లామర్‌కు నో | “No Glamour” Says Kajal Aggarwal | Sakshi
Sakshi News home page

ఇక గ్లామర్‌కు నో

Published Sun, Dec 20 2015 2:24 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఇక గ్లామర్‌కు నో - Sakshi

ఇక గ్లామర్‌కు నో

వెండి తెరపై అందాలు పరచడానికి ఏ మాత్రం వెనుకాడని నటీమణుల్లో కాజల్ అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. సహ హీరోయిన్లు తమన్న, శ్రీయ లాంటి వారితో పోటీ పడి మరీ గ్లామరస్ పాత్రల్లో దుమ్మురేపారని అనాలి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ చుట్టేస్తున్న కాజల్ అగర్వాల్‌లో తాజాగా ఒక నిర్ణయం తీసుకుందట. ఇకపై అందాలారబోత విషయంలో హద్దులు మీరరాదన్నదే ఆ నిర్ణయం.ప్రస్తుతం హిందీలో టు లబ్జాన్ కీ కహానీ అనే చిత్రంలో నటిస్తున్న కాజల్ ఈ విషయం గురించి మాట్లాడుతూ నటిగా తానిప్పుడు ఉన్నత స్థానంలోనే ఉన్నానన్నారు.
 
  ప్రముఖ నటులందరితోనూ నటించానని అదే విధంగా గ్లామర్, నటనకు అవకాశం ఉన్న కథా చిత్రాలు అంటూ అన్ని రకాల పాత్రలు చేశానని పేర్కొన్నారు. ఇకపై గ్లామర్‌ను తగ్గించి నటనకు చాలెంజ్‌గా ఉండే పాత్రలకు ప్రాముఖ్యత నివ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం టు లబ్జాన్ కీ కహానీ అనే హిందీ చిత్రంలో అంధురాలిగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం చాలా రిహార్శల్స్ చేసినట్లు, అంద పాఠశాలలకు వెళ్లి అక్కడ అంధుల హావభావాలను, వారి శారీరక భాష గురించి గమనించినట్లు తెలిపారు. ఏదేమైనా కాజల్ అగర్వాల్ నిర్ణయం మంచిదే. అయితే దానికి తన ఎంతవరకు కట్టుబడి ఉంటారన్నదే ప్రశ్న అంటున్నారు చిత్ర వర్గాలు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement