మణిరత్నం చిత్రంలో ఐష్? | Aishwarya Rai Bachchan and Mani Ratnam again? | Sakshi
Sakshi News home page

మణిరత్నం చిత్రంలో ఐష్?

Published Wed, May 27 2015 2:31 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మణిరత్నం చిత్రంలో ఐష్? - Sakshi

మణిరత్నం చిత్రంలో ఐష్?

మణిరత్నం తాజా చిత్రంలో హీరోయిన్ ఐశ్వర్యారాయ్‌నా? ప్రస్తుతం మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్న న్యూస్ ఇదే. కొంతకాలంగా మణిరత్నంతో దోబూచులాడిన విజయం ఓ కాదల్ కణ్మని చేతికందింది. దీంతో ఖుషీగా ఉన్న మణి తన తాజా చిత్ర పనుల్లో నిమగ్నమైనట్లు సమాచారం. ఆయన ఇంతకుముందు కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ కలయికలో ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నించారు.
 
  అందులో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ పేర్లు చోటుచేసుకున్నాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఆ చిత్ర నిర్మాణం జరగలేదు. ఇప్పుడా ప్రాజెక్టును చేపట్టే ఆలోచనలో మణి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ ప్రపంచ సుందరి ఐష్ కూడా నటిగా రీఎంట్రీ అయ్యారు. అయితే కోలీవుడ్‌లో మళ్లీ నటించాలంటే అది మణిరత్నం చిత్రమే అవుతుందని ఇటీవల ఒక కార్యక్రమంలో ఆమె పేర్కొన్నారు.
 
 ఐశ్వర్యారాయ్ కోలీవుడ్‌కు ఇరువర్ చిత్రం ద్వారా పరిచయం చేసింది మణిరత్నమే నన్నది గమనార్హం. ఆ అభిమానంతోనే మణి దర్శకత్వంలో నటించడానికి తానెప్పుడూ సిద్ధమేనని ఐశ్వర్యారాయ్ ప్రకటించారు. అయితే మణిరత్నం మనసులో ఏముందోగాని ఆయన తన తాజా చిత్రం గురించి మౌనముద్ర వీడడం లేదు. కోలీవుడ్‌లో మాత్రం, ఇలా ఐష్‌తో చిత్రం అని, నటుడు ధనుష్‌తో ద్విభాషా చిత్ర మని రకరకాల ప్రచారం సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement