అందాలారబోతకు సై | Actress meghna raj ready for Glamour roles | Sakshi
Sakshi News home page

అందాలారబోతకు సై

Published Thu, Jun 4 2015 3:05 AM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM

అందాలారబోతకు సై

అందాలారబోతకు సై

అందాలారబోతకు దూరం అన్న చాలా మంది ప్రముఖ నటీమణులు ఆ తరువాత తెరపై గ్లామర్‌ను గుమ్మరించారు. ఇప్పుడు నటి మేఘ్నారాజ్ కూడా ఈ కోవలోకి చేరారు. కోలీవుడ్‌లో ఉయిర్ తిరు 420, నందానందిత చిత్రాల్లో నటించిన ఈ మళయాలి బ్యూటీకి ఆ చిత్రాలేవీ విజయాల్ని అందించలేదు. దీంతో మాతృభాషతో పాటు తెలుగు, కన్నడం భాషా చిత్రాలపై దృష్టి సారించారు. తెలుగులో బెండుఅప్పారావు చిత్రంలో చేసినా పెద్దగా పేరు రాలేదు.
 
 ప్రస్తుతం మలయాళం,కన్నడ భాషల్లో అడపాదడపా చిత్రాలు చేస్తున్న మేఘ్నారాజ్‌కు కోలీవుడ్‌లో ఒక అవకాశం వచ్చింది. మలయాళంలో నటి సీమ నటించిన అవలోర్ రావుగళ్ చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేస్తున్నారు. ఇందులో నాయకి పాత్రకు శృంగారభరిత సన్నివేశాలు ఉంటాయట. తమిళంలో ఈ పాత్ర పోషించడానికి చాలా మంది హీరోయిన్లు నిరాకరించడంతో ఆ అవకాశం నటి మేఘ్నారాజ్ తలుపు తట్టిందని సమాచారం. అయితే మేఘ్నా ఆ చాన్స్‌ను మంచి తరుణం మించిపోనీకూ అన్న చందాన మరు మాట చెప్పకుండా ఒప్పేసుకున్నారట. త్వరలో తమిళ తెరపై మేఘ్నా అందాలు చూడబోతున్నామన్నమాట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement