meghna raj
-
చిరంజీవి సర్జా వర్థంతి: జూ. చిరుతో కలిసి కుటుంబ సభ్యుల పూజలు
యశవంతపుర: శాండల్‌వుడ్ నటుడు చిరంజీవి సర్జా కన్నుమూసి సోమవారానికి ఏడాది అయ్యింది. 2020 జూన్ 7న ఆయన హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. కనకపుర రోడ్డులోని కగ్గిలిపుర నలగుళి వద్ద ధ్రువసర్జా ఫాంహౌస్‌లో సర్జా సమాధికి భార్య మేఘనారాజ్, చిన్నారి కొడుకు జూనియర్ చిరు, కుటుంబసభ్యులతో కలిసి పూజలు చేశారు. ప్రముఖ నటుడు, మేనమామ అర్జున్ సర్జా చిరుతో తీసుకున్న చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి సర్మించుకున్నారు. జీవితంలో పూర్తి మిస్ అయ్యామని, మీరు ఎక్కడ ఉన్నా నవ్వుతూ ఉండాలని కోరుకున్నారు. చదవండి: చిరంజీవి సర్జా తొలి వర్థంతి, మేఘన ఎమోషనల్ -
మొదటిసారి తెలుగులో.. సంతోషంగా ఉంది: నజ్రియా
మలయాళం సినిమా ‘బెంగళూరు డేస్’ ఫేం నజ్రియా నజీమ్ తెలుగు అభిమానులకు దీపావళికి సర్ప్రైజ్ ఇచ్చారు. త్వరలో తెలుగు ప్రేక్షకులను ఆలరించడానికి వస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ‘బ్రోచేవారేవరురా’, ‘మెంటల్ మదిలో’ సినిమా దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం, మైత్రీ మూవీ మేకర్స్‌లో.. నాచ్యులర్ స్టార్ నానీతో కలిసి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నట్లు నజ్రియా పేర్కొంది. అయితే నానీ 28వ చిత్రమైన ఈ సినిమా టైటిల్‌ను నవంబర్ 21వ తేదీన ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా నజ్రియా ఈ కార్యక్రమానికి సంబంధించిన పొస్టర్‌ను శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ... ‘ఇదే నా మొదటి తెలుగు సినిమా గాయ్స్.. అద్భుతమైన టీంతో వర్క్ చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నవంబర్ 21 తేదీని వైరల్ చేయండి.. ట్యూన్ చేయండి, హ్యాపీ దీపావళి’ అంటూ రాసుకొచ్చారు. (చదవండి: ఈ నెల 21న కలుద్దామంటున్న నాని!) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) ఇక తన పోస్టు చూసిన కన్నడ నటి, దివంగత హీనో చిరంజీవి సర్జా భార్య మెఘనా రాజ్, నజ్రీయాకు శుభాకాంక్షలు తెలిపారు. ‘శుభాకాంక్షలు మై బేబీ గల్’ అంటూ నజ్రీయా పోస్టుకు మెఘానా ట్యాగ్ చేసి షేర్ చేశారు. కాగా నజ్రియా, మెఘనాలు 2013లో వచ్చిన మాలయాళ చిత్రం ‘మాడ్ డాడ్’లో కలిసి నటించారు. అయితే ఇప్పటి వరకు నజ్రీయా తెలుగులో నటించకపోయినప్పటికీ తనంటే చేవి కొసుకునే తెలుగు అభిమానులు చాల మంది ఉన్నారు. ఇక ఆమె తెలుగులో నటిస్తున్నట్లు ప్రకటించడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. -
అందాలారబోతకు సై
అందాలారబోతకు దూరం అన్న చాలా మంది ప్రముఖ నటీమణులు ఆ తరువాత తెరపై గ్లామర్‌ను గుమ్మరించారు. ఇప్పుడు నటి మేఘ్నారాజ్ కూడా ఈ కోవలోకి చేరారు. కోలీవుడ్‌లో ఉయిర్ తిరు 420, నందానందిత చిత్రాల్లో నటించిన ఈ మళయాలి బ్యూటీకి ఆ చిత్రాలేవీ విజయాల్ని అందించలేదు. దీంతో మాతృభాషతో పాటు తెలుగు, కన్నడం భాషా చిత్రాలపై దృష్టి సారించారు. తెలుగులో బెండుఅప్పారావు చిత్రంలో చేసినా పెద్దగా పేరు రాలేదు. ప్రస్తుతం మలయాళం,కన్నడ భాషల్లో అడపాదడపా చిత్రాలు చేస్తున్న మేఘ్నారాజ్కు కోలీవుడ్‌లో ఒక అవకాశం వచ్చింది. మలయాళంలో నటి సీమ నటించిన అవలోర్ రావుగళ్ చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేస్తున్నారు. ఇందులో నాయకి పాత్రకు శృంగారభరిత సన్నివేశాలు ఉంటాయట. తమిళంలో ఈ పాత్ర పోషించడానికి చాలా మంది హీరోయిన్లు నిరాకరించడంతో ఆ అవకాశం నటి మేఘ్నారాజ్ తలుపు తట్టిందని సమాచారం. అయితే మేఘ్నా ఆ చాన్స్‌ను మంచి తరుణం మించిపోనీకూ అన్న చందాన మరు మాట చెప్పకుండా ఒప్పేసుకున్నారట. త్వరలో తమిళ తెరపై మేఘ్నా అందాలు చూడబోతున్నామన్నమాట. -
నజ్రియూకు బాసట
నయ్యాండి చిత్ర వ్యవహారంలో నజ్రియూ నజిమ్‌కు మేఘ్నారాజ్ మద్దతుగా నిలిచింది. నయ్యాండి చిత్ర వ్యవహారంలో నజ్రియూ అనవసర రాద్దాంతం చేసిందంటూ నయనతార ఇదివరకు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో నజ్రియూకు మేఘ్నారాజ్ బాసటగా నిలిచింది. ఆమె మాట్లాడుతూ పొట్ట కనిపించేలా నటించడానికి నిరాకరించిన నజ్రియా భావాన్ని గౌరవించాలని పేర్కొంది. తమిళ చిత్రం సుందర పాండియన్‌లో లక్ష్మీమీనన్ పోషించిన పాత్రను తాను కన్నడంలో చేసినట్లు చెప్పింది. కన్నడ సంస్కృతి, సంప్రదాయాలకు తగ్గట్టుగా కథలు మార్పులు చేర్పులు చేసినట్లు తెలిపింది. తమిళంలో లక్ష్మీమీనన్ నటన తనకు నచ్చిందని చెప్పింది. అయితే తాను ఆమె నటనను అనుకరించనని, కన్నడ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తనదైన బాణీలో నటిస్తానని అంది. నజ్రియా వ్యవహారం గురించి తన వద్ద చాలా మంది ప్రస్తావిస్తున్నారని తెలిపింది. నజ్రియా తనకు మంచి స్నేహితురాలని చెప్పింది. నటన అనేది వారివారి వ్యక్తిగత విషయమని పేర్కొంది. నజ్రియా కుటుంబం సనాతన సంప్రదాయాల నుంచి ఇంకా మారలేదని తెలిపింది. కాబట్టి ఆమె భావాన్ని గౌరవించాలని మేఘ్నారాజ్ తెలిపింది.