నజ్రియూకు బాసట | meghna raj supports nazriya nazim | Sakshi
Sakshi News home page

నజ్రియూకు బాసట

Nov 2 2013 12:22 AM | Updated on Sep 2 2017 12:12 AM

నజ్రియూకు బాసట

నజ్రియూకు బాసట

నయ్యాండి చిత్ర వ్యవహారంలో నజ్రియూ నజిమ్‌కు మేఘ్నారాజ్ మద్దతుగా నిలిచింది. నయ్యాండి చిత్ర వ్యవహారంలో నజ్రియూ అనవసర రాద్దాంతం చేసిందంటూ నయనతార ఇదివరకు వ్యాఖ్యానించింది

 నయ్యాండి చిత్ర వ్యవహారంలో నజ్రియూ నజిమ్‌కు మేఘ్నారాజ్ మద్దతుగా నిలిచింది. నయ్యాండి చిత్ర వ్యవహారంలో నజ్రియూ అనవసర రాద్దాంతం చేసిందంటూ నయనతార ఇదివరకు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో నజ్రియూకు మేఘ్నారాజ్ బాసటగా నిలిచింది. ఆమె మాట్లాడుతూ పొట్ట కనిపించేలా నటించడానికి నిరాకరించిన నజ్రియా భావాన్ని గౌరవించాలని పేర్కొంది. తమిళ చిత్రం సుందర పాండియన్‌లో లక్ష్మీమీనన్ పోషించిన పాత్రను తాను కన్నడంలో చేసినట్లు చెప్పింది. కన్నడ సంస్కృతి, సంప్రదాయాలకు తగ్గట్టుగా కథలు మార్పులు చేర్పులు చేసినట్లు తెలిపింది. తమిళంలో లక్ష్మీమీనన్ నటన తనకు నచ్చిందని చెప్పింది. అయితే తాను ఆమె నటనను అనుకరించనని, కన్నడ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తనదైన బాణీలో నటిస్తానని అంది.
 
  నజ్రియా వ్యవహారం గురించి తన వద్ద చాలా మంది ప్రస్తావిస్తున్నారని తెలిపింది. నజ్రియా తనకు మంచి స్నేహితురాలని చెప్పింది. నటన అనేది వారివారి వ్యక్తిగత విషయమని పేర్కొంది. నజ్రియా కుటుంబం సనాతన సంప్రదాయాల నుంచి ఇంకా మారలేదని తెలిపింది. కాబట్టి ఆమె భావాన్ని గౌరవించాలని మేఘ్నారాజ్ తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement