నేడే నజ్రియా పెళ్లి | Preparations in Full Swing for Fahadh - Nazriya Wedding on 21 August | Sakshi
Sakshi News home page

నేడే నజ్రియా పెళ్లి

Published Thu, Aug 21 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM

నేడే నజ్రియా పెళ్లి

నేడే నజ్రియా పెళ్లి

 నటి నజ్రియా పెళ్లి గురువారం జరగనుంది. నేరం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన కేరళ కుట్టి నజ్రియా నజీమ్. అనంతరం రాజారాణి, నయాండి, వాయైమూడి పేసవుం, తిరుమణం ఎనుం నిఖా తదితర చిత్రాల్లో నటించి అనతికలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ ముద్దుగుమ్మకు మలయాళ నటుడు భగత్ పాజిల్‌తో ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. ఇది ఇరు కుటుంబాలు నిశ్చయించిన పెళ్లి. భగత్ దర్శకుడు ఫాజిల్ కుమారుడు.
 
 మలయాళంలో కేరళా కబే, కాక్‌టెయిల్, రెడ్ వైన్ తదితర చిత్రాల్లో హీరోగా నటించి పాపులర్ అయ్యారు. భగత్ పాజిల్, నజ్రియాల వివాహం గురువారం కేరళ లోని తిరువనంతపురంలో ముస్లింల వివాహ సంప్రదాయం ప్రకారం జరగనుంది. వీరి వివాహ రిసెప్షన్ 24వ తేదీన ఆలప్పుళాలో జరగనుంది.  తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఈ వివాహానికి హాజరుకానున్నారు.  నజ్రియా నిశ్చితార్థంతోనే నటనకు ఫుల్‌స్టాప్ పెట్టారు. తమిళంలో ఆమె నటించిన తిరుమణం ఎనుమ్ నిఖా చివరిగా విడుదలయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement