Actress Nazriya Nazim To Act In Female Centric Web Series - Sakshi
Sakshi News home page

Nazriya Nazim: చాలా గ్యాప్‌​ తర్వాత అక్కడ రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్‌

Published Fri, Aug 4 2023 9:51 AM | Last Updated on Fri, Aug 4 2023 10:00 AM

Nazriya Nazim To Act in Web Series - Sakshi

మాలీవుడ్‌ భామ నటి నజ్రియా తొలుత మాతృభాషలో కథానాయకిగా పరిచయమైంది. ఆ తరువాత తమిళంలో నేరం, రాజారాణి, నయ్యాండి, తిరుమనమ్‌ ఎనుమ్‌ నిఖ్కా తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్‌గా మంచి క్రేజ్‌ ఉండగానే నటుడు ఫహద్‌ ఫాజిల్‌ను పెళ్లి చేసుకుని నటనకు దూరమైంది. అయితే అది కొంతకాలమే! తర్వాత నజ్రియా మళ్లీ నటనపై దృష్టి సారించింది. లక్కీగా ఈమెకు మళ్లీ హీరోయిన్‌ ఛాన్సులే రావడం మొదలెట్టాయి.

మలయాళ చిత్రాల్లో నటిస్తున్న నజ్రియా ఆ మధ్య తెలుగులోనూ నానితో అంటే సుందరానికి చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం పెద్దగా సక్సెస్‌ కాకపోవడంతో అక్కడ మరో అవకాశం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ తమిళంలో నటించడానికి సిద్ధమవుతోందనేది తాజా సమాచారం. అయితే ఈసారి నటించేది చిత్రంలో కాదు. వెబ్‌ సిరీస్‌లో నట.

దర్శకుడు విజయ్‌ కొత్త కాంబినేషన్లను సెట్‌ చేయడంలో దిట్ట. ప్రస్తుతం ఈయన నటుడు అరుణ్‌ విజయ్‌, అమీ జాక్సన్‌ జంటగా మిషన్‌ చాప్టర్‌ –1 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా నిర్మాతగా అవతారం ఎత్తబోతున్నారు. తొలి ప్రయత్నంగా ఒక వెబ్‌ సిరీస్‌ను రూపొందించనున్నారు. ఈయన నిర్మిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌లో నజ్రియా ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇందులో నటుడు శాంతను ముఖ్యపాత్రలో నటించనున్నట్లు తెలిసింది. సూర్య ప్రతాప్‌ దర్శకత్వం వహించనున్న ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

చదవండి: కార్తీ జపాన్‌కు భారీ బిజినెస్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement