మొదటిసారి తెలుగులో.. సంతోషంగా ఉంది: నజ్రియా | Nazriya Nazim Announce Her Telugu Debut With Hero Nani | Sakshi
Sakshi News home page

‘తెలుగులో తొలిసారిగా.. టైటిల్‌ తేదీని వైరల్‌ చేయండి’

Nov 13 2020 5:19 PM | Updated on Nov 13 2020 8:44 PM

Nazriya Nazim Announce Her Telugu Debut With Hero Nani - Sakshi

మలయాళం సినిమా ‘బెంగళూరు డేస్‌’ ఫేం నజ్రియా నజీమ్ తెలుగు అభిమానులకు దీపావళికి సర్‌ప్రైజ్ ఇచ్చారు‌. త్వరలో తెలుగు ప్రేక్షకులను ఆలరించడానికి వస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించారు. ‘బ్రోచేవారేవరురా’, ‘మెంటల్‌ మదిలో’ సినిమా దర్శకుడు వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం, మైత్రీ మూవీ మేకర్స్‌లో.. నాచ్యులర్‌ స్టార్‌ నానీతో కలిసి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నట్లు నజ్రియా పేర్కొంది. అయితే నానీ 28వ చిత్రమైన ఈ సినిమా టైటిల్‌ను నవంబర్‌ 21వ తేదీన‌ ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ సందర్భంగా నజ్రియా ఈ కార్యక్రమానికి సంబంధించిన పొస్టర్‌ను శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ... ‘ఇదే నా మొదటి తెలుగు సినిమా గాయ్స్‌.. అద్భుతమైన టీంతో వర్క్‌ చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నవంబర్‌ 21 తేదీని వైరల్‌ చేయండి.. ట్యూన్‌ చేయండి, హ్యాపీ దీపావళి’ అంటూ రాసుకొచ్చారు. (చదవండి: ఈ నెల‌ 21న కలుద్దామంటున్న నాని!)

ఇక తన పోస్టు చూసిన కన్నడ నటి, దివంగత హీనో చిరంజీవి సర్జా భార్య మెఘనా రాజ్‌, నజ్రీయాకు శుభాకాంక్షలు తెలిపారు. ‘శుభాకాంక్షలు మై బేబీ గల్‌’ అంటూ నజ్రీయా పోస్టుకు మెఘానా ట్యాగ్‌ చేసి షేర్‌ చేశారు. కాగా నజ్రియా, మెఘనాలు 2013లో వచ్చిన మాలయాళ చిత్రం ‘మాడ్‌ డాడ్‌’లో కలిసి నటించారు. అయితే ఇప్పటి వరకు నజ్రీయా తెలుగులో నటించకపోయినప్పటికీ తనంటే చేవి కొసుకునే తెలుగు అభిమానులు చాల మంది ఉన్నారు. ఇక ఆమె తెలుగులో నటిస్తున్నట్లు ప్రకటించడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement