
అందాలు ఆరబోయాలట
అందాలను విచ్చల విడిగా ఆరబోయడానికి నేను సైతం అంటున్న నేటి హీరోయిన్ల మధ్య దేనికైనా హద్దులు ఉంటాయని అంటోంది నటి శ్రీదివ్య. ఈ అచ్చ తెలుగు అమ్మాయి తమిళ చిత్ర పరిశ్రమలో వరుసగా విజయాలు సాధించి పక్కింటి అమ్మాయి ఇమెజ్‌ను సొంతం చేసుకుంది. అలాంటి ఇమెజ్‌ను పొందడం తన అదృష్టాంగా భావిస్తున్న శ్రీదివ్య దానిని దూరం చేసుకోనని అంటోన్నది. వర్తపడాద వాలిబర్ సంఘం చిత్రం విజయంతో తమిళ చిత్ర పరిశ్రమ దృష్టిని తన వైపుకు తిప్పుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత నటించిన జీవా కూడా విజయం బాట పట్టడంతో ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను చిత్రాల వరకు ఉన్నాయి.
2010లో మనసారా చిత్రంతో టాలీవుడ్‌లో పరిచయమైన శ్రీ దివ్యను టాలీవుడ్‌కంటే కోలీవుడ్ అధికంగా ఆదుకుందని చెప్పక తప్పదు. తమిళ చిత్ర పరిశ్రమలోనే తనకు మంచి అవకాశాలు వస్తున్నాయని ఈ బ్యూటీ పేర్కొంది. అయితే, ఎక్కువగా లంగావోని, చీర కట్టు పాత్రలకు పరిమితం చేస్తున్నారని, అది కాస్త చింత కల్గించే విషయమేనని అంటోంది. తనకు మోడ్రన్ దుస్తులు ధరించాలంటే, చాలా ఇష్టం అని, అయితే మోడ్రన్ పాత్రలు వేరు, గ్లామరస్ పాత్రలు వేరని చెబుతున్నది.
ఇటీవల ఓ చిత్రంలో అందాల ఆరబోయాలని చెప్పడంతో అది ప్రముఖ హీరోతో నటించే చిత్రమైనా నిరాకరించినట్లు పేర్కొంది. తాను పాత్రల వైవిధ్యానికే ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది. తన ముఖంలోని అమాయకత్వమే తనకు ప్లస్ అని పేర్కొంది. ప్రస్తుతం శ్రీ దివ్య పెన్సిల్, ఈటీ, బెంగళూరు డేస్ రీమేక్ చిత్రం, కవలై వేండాం చిత్రాలతో పాటుగా కార్తీతో ఓ చిత్రం చేయనున్నది.