పెళ్లి గురించి హింట్ ఇచ్చేసిన తెలుగు హీరోయిన్! | Actress Sri Divya Gives Clarify On Her Marriage, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Sri Divya Marriage: ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను.. తెలుగు హీరోయిన్ క్లారిటీ!

Published Wed, Jan 31 2024 7:48 AM | Last Updated on Wed, Jan 31 2024 8:29 AM

Actress Sri Divya Clarify On Her Marriage  - Sakshi

గత రెండు మూడు నెలల్లో సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. మరికొందరు నిశ్చితార్థం చేసుకుంటూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయిపోతున్నారు. చెప్పుకొంటే ఈ లిస్టులో చాలామంది తెలుగు స్టార్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు తెలుగమ్మాయి శ్రీ దివ్య కూడా తన పెళ్లి గురించి ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఎప్పుడు చేసుకుంటాననేది చెప్పేసింది.

(ఇదీ చదవండి: స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?)

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన శ్రీ దివ్య.. 'హనుమాన్ జంక్షన్', 'యువరాజు', 'వీడే' లాంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. 'మనసారా' అనే సినిమాతో హీరోయిన్ అయిపోయింది. దీని తర్వాత బస్‌స్టాప్, కేరింత లాంటి మూవీస్ చేసినప్పటికీ ఎందుకో టాలీవుడ్‌లో ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళంలోకి షిఫ్ట్ అయిపోయింది. అక్కడ వరసపెట్టి చిత్రాల్లో నటించింది. 2013లో మొదలుపెడితే ఇప్పటికీ చేస్తూనే ఉంది.

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో శ్రీ దివ్యకు తమిళంలో కూడా అవకాశాలు తగ్గాయి. అయితే ఓ కమెడియన్ ఇచ్చిన పార్టీలో తప్ప తాగి పడిపోయిందని, దీంతో ఈమె పేరు డ్యామేజ్ అవ్వడమే కాకుండా ఛాన్సులు కూడా తగ్గిపోయాయని మాట్లాడుకున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది పక్కనబెడితే హీరోయిన్‌గా కమ్ బ్యాక్ ఇచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. అలా సక్సెస్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని నిర్ణయించుకుందట. ఈ విషయమే సన్నిహితుల దగ్గర చెప్పిందట. దీనిపై ఆమె వైపు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: నిశ్చితార్థం జరిగిన నాలుగేళ్లకు పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement