నేటి బాలలే రేపటి పౌరులు.. అన్న విధంగా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులే ఇప్పుడు హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. బాలనటులుగా నటించిన ఎందరో ఇప్పుడు అగ్రతారలుగా చలామణీ అవుతున్నారు. మరికొందరేమో స్టార్ హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ పిల్లలిద్దరూ టాలీవుడ్‌లో సినిమాలు చేశారు. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా? ఒకరేమో హీరో తేజ సజ్జ.. మరొకరేమో హీరోయిన్ శ్రీదివ్య.
చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోగా
ఈ స్టిల్ యువరాజు సినిమాలోనిది. తేజ టాలీవుడ్‌లో బిజీ అయిపోతుంటే శ్రీదివ్య కోలీవుడ్‌లో వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. తేజ సజ్జ.. అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, మహేశ్‌బాబు, శ్రీకాంత్.. ఇలా ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో బుడ్డోడిగా నటించి మెప్పించాడు. చిన్నతనంలోనే నటనలో ఆరితేరిన తేజ.. జాంబి రెడ్డి సినిమాతో హీరోగా మారాడు. ఇష్క్, అద్భుతం చిత్రాల్లో కథానాయకుడిగా నటించాడు. ప్రస్తుతం హనుమాన్ సినిమా చేస్తున్నాడు.
బిజీ అయిపోయిన శ్రీదివ్య
శ్రీదివ్య.. హనుమాన్ జంక్షన్, యువరాజ్, వీడే, భారతి సినిమాల్లో బాలనటిగా మెప్పించింది. మనసారా సినిమాతో హీరోయిన్‌గా మారింది. బస్ స్టాప్, కేరింత చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగింటి అమ్మాయైన శ్రీదివ్య తమిళంలో బాగా బిజీ అయింది. మలయాళంలోనూ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఇటీవలే రైడ్ మూవీతో తమిళ ప్రేక్షకులను పలకరించింది.
చదవండి: పాపం.. సెల్ఫీ అడిగినందుకు అభిమానిని కొట్టి మెడ పట్టి తోశారు.. మరీ ఇంత ఘోరమా?
Comments
Please login to add a commentAdd a comment