ప్రేమలో పడిన మరో తెలుగు హీరోయిన్.. త్వరలో పెళ్లి! | Actress Sri Divya Comments On Marriage | Sakshi
Sakshi News home page

ప్రేమలో పడిన మరో తెలుగు హీరోయిన్.. త్వరలో పెళ్లి!

Published Tue, Oct 31 2023 6:43 AM | Last Updated on Tue, Oct 31 2023 8:20 AM

Actress Sri Divya In Love Comments On Marriage - Sakshi

మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లికి అంతా రెడీ. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో పడిన ఇతడు.. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నాడు. సరే దీని గురించి పక్కనబెడితే ఓ తెలుగు హీరోయిన్ ప్రేమలో పడినట్లు ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఏం కామెంట్స్ చేసింది.

(ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)

బాలనటిగా కెరీర్ మొదలుపెట్టిన శ్రీదివ్య తెలుగమ్మాయి. కానీ టాలీవుడ్‌లో మారుతి దర్శకత్వం వహించిన 'బస్టాప్', 'కేరింత' సినిమాల్లో మాత్రమే నటించింది. ఆపై తమిళ సినిమాలే చేస్తూ అక్కడ సెటిలైపోయింది. శివకార్తికేయన్‌ 'వరుత్తపడాద వాలిబర్‌ సంఘం' అనే మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం సక్సెస్ కావడంతో ఈమెకి వరసపెట్టి ఛాన్సులు వచ్చాయి. అలా 'కాక్కీ సట్టై', 'జీవా', 'ఈటీ', 'మరుదు', 'బెంగుళూర్‌ నాట్కల్‌', 'పెన్సిల్‌' తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. 

ప్రస్తుతం విక్రమ్‌ ప్రభు 'రైడ్‌' సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఇది త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్‌లో శ్రీదివ్యని ప్రేమ, పెళ్లి గురించి రిపోర్టర్ ప్రశ్నించాడు. దీనికి బదులిచ్చిన ఈ బ్యూటీ.. 'త్వరలోనే పెళ్లి చేసుకుంటాను. ప్రేమ వివాహమే చేసుకుంటాను. అదీ నా ప్రియుడినే పెళ్లి చేసుకుంటాను' అని చెప్పింది. దీంతో ఎవరా కుర్రాడు?  ఎప్పుడు పెళ్లి చేసుకోనుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

(ఇదీ చదవండి: Bigg Boss 7: బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవ.. ఈసారి నామినేషన్స్‌లో ఉన్నదెవరంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement