ఆ చిత్రాలు చేసుంటే రికార్డ్ సాధించేదాన్ని | I Am Not Interested In Commercial Or Glamour Roles | Sakshi
Sakshi News home page

ఆ చిత్రాలు చేసుంటే రికార్డ్ సాధించేదాన్ని

Published Thu, May 14 2015 4:39 AM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM

ఆ చిత్రాలు చేసుంటే రికార్డ్ సాధించేదాన్ని

ఆ చిత్రాలు చేసుంటే రికార్డ్ సాధించేదాన్ని

గ్లామరస్ పాత్రల అవకాశాలన్నీ అంగీకరించి చేస్తే నా బ్యాంక్ బాలెన్స్ ఎప్పుడో ఫుల్ అయ్యేది. పలు చిత్రాలు చేసిన నటిగా రికార్డ్ సాధించేదాన్ని అంటున్నారు నటి నిత్యామీనన్. కోలీవుడ్‌లో మొట్టమొదటిసారిగా ఒకేసారి ఓ కాదల్ కణ్మణి, కాంచన-2 చిత్రాలతో విజయాన్ని అందుకున్న నటి నిత్యామీనన్. అయితే ఈమె పలు షరతులు విధిస్తుందని, ఇంకా చెప్పాలంటే చాలా పొగరుబోతు అని ప్రచారంలో ఉంది. ఈ విషయంపై నిత్యామీనన్ స్పందిస్తూ సినిమాను ఒక కళగా భావిస్తానన్నారు
 
 . అంతేకాని డబ్బు సంపాదించే వృత్తిగా చూడనన్నారు. తాను నటించే పాత్ర తనలో ప్రవేశించాలని, అలా కాకుండా షూటింగ్ స్పాట్‌కు వచ్చామా? దర్శకుడు చెప్పిన సంభాషణలు బట్టీపట్టి ఆయన సూచనలు మేరకు నటించామా? వెళ్లామా? అన్నట్టు ఉండలేనన్నారు. తన కిచ్చిన పాత్రలో జీవించడానికి ప్రయత్నిస్తానన్నారు. కాంచన-2 చిత్రంలో వికలాంగురాలి పాత్రలో నటించమని లారెన్స్ కోరినప్పుడు తాను వెంటనే ఓకే చెప్పలేదన్నారు. ఆ పాత్రలో తాను నటించగలనా అని ప్రాక్టీస్ చేసి సంతృప్తి కలిగిన తరువాత నటిస్తానని చెప్పానన్నారు.
 
 తన కోసం లారెన్స్ రెండు నెలలు వేచి ఉన్నారని తెలిపారు. తన పాత్ర గురించి ముందుగా చాలా ప్రశ్నలు వేస్తానన్నారు. అంగీకరించిన తరువాత ఇక ప్రశ్నలే తావుండదని అన్నారు. మరో విషయం ఏమిటంటే తనను గ్లామర్ పాత్రల్లో నటించమని పలువురు అడిగారన్నారు. అవన్నీ ఒప్పుకుంటే తన బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడో ఫుల్ అయిపోయి ఉండేదని అలాగే పలు చిత్రాలు చేసిన నటిగా గుర్తింపు పొందేదాన్నని నిత్యామీనన్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement