ఎన్టీఆర్ సరసన మలయాళీ బ్యూటీస్
జనతా గ్యారేజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన ఎన్టీఆర్ తన తరువాతి సినిమా ఎంపిక కోసం చాలా రోజులు ఎదురుచూశాడు. ఫైనల్గా పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకె చెప్పిన జూనియర్, ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది.
జనతా గ్యారేజ్ సినిమాలో ఎక్కువ మంది మలయాళీ నటులతో కలిసి నటించిన ఎన్టీఆర్, కొత్త సినిమా విషయంలో కూడా అదే సెంటిమెంట్ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడట. అందుకే హీరోయిన్లుగా ఇద్దరు మలయాళీ ముద్దుగుమ్మలను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడు. కాజల్తో పాటు మరో రెండు కీలక పాత్రలకు నివేదాథామస్, అనుపమ పరమేశ్వరన్లను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ మలయాళీ సెంటిమెంట్ బుడ్డోడికి ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి.