నాలుగు కథలు.... ఒకటే ప్రపంచం | Four stories .... One World | Sakshi
Sakshi News home page

నాలుగు కథలు.... ఒకటే ప్రపంచం

Published Fri, May 20 2016 11:19 PM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

నాలుగు కథలు.... ఒకటే ప్రపంచం

నాలుగు కథలు.... ఒకటే ప్రపంచం

మలయాళ నటుడు మోహన్‌లాల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ‘మనమంతా’ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. ‘ఐతే’, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘సాహసం’ చిత్రాల ఫేమ్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సాయిశివాని సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి దీన్ని నిర్మిస్తున్నారు.

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో సీనియర్ నటి గౌతమి కీలక పాత్ర పోషిస్తున్నారు.  ‘‘‘నాలుగు కథలు ఒకటే ప్రపంచం’ అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. త్వరలోనే నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రారంభిస్తాం’’ అని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: మహేశ్ శంకర్, సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement