స్క్రీన్ టెస్ట్
‘జనతా గ్యారేజ్’లోని ‘నేను పక్కా లోకల్...’ పాటలో మొదటి చరణం ఏ వాక్యంతో మొదలవుతుంది?
ఎ) ఇంగిలీషులోన దణ్ణమెట్టనెప్పుడూ...
బి) వన్ ప్లస్ వన్ ఆఫరున్నదే...
సి) హలో హలో మైకు టెస్టింగ్...
డి) నే ఉన్నూరు గీతదాటనే...
తెలుగులో స్టీరియోఫోనిక్ సౌండ్ ఉపయోగించిన తొలి సినిమా?
ఎ) సింహబలుడు బి) సింహాసనం
సి) సీతారామ కల్యాణం
డి) సిరివెన్నెల
సుకుమార్ కథ అందించి, నిర్మించిన ‘కుమారి 21ఎఫ్’ఏ హాలీవుడ్ సినిమాకు కాపీ?
ఎ) లైలా సేస్
బి) షెర్లాక్ హోమ్స్ సి) ప్రెట్టి విమెన్
డి) వాలంటైన్స్ డే
త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు చెబితే... ఆయన రాసిన మాటలే గుర్తొస్తాయి. కానీ, రవితేజ హీరోగా నటించిన ఓ సినిమాలోని పాటలన్నిటినీ త్రివిక్రమ్ రాశారు. చక్రి సంగీతం అందించిన ఆ సినిమా పేరు?
ఎ) ఔను–వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు!
బి) భగీరథ సి) ఒక రాజు ఒక రాణి
డి) ఇడియట్
‘మగధీర’లోని ‘ఒక్కొక్కర్ని కాదు షేర్‌ఖాన్.. వంద మందిని ఒకేసారి పంపు’ అనే డైలాగ్‌కి సంబంధించిన ఫైట్ సీక్వెన్స్ డిజైన్ చేసిన ఫైట్ మాస్టర్ ఎవరు?
ఎ) రామ్–లక్ష్మణ్ బి) అణల్ అరసు
సి) పీటర్ హెయిన్స్
డి) కణల్ కన్నన్
సీనియర్ ఎన్టీఆర్ టార్జాన్‌గా నటించిన సినిమా?
ఎ) రాజపుత్ర రహస్యం
బి) సింహబలుడు
సి) గులేబకావళి కథ
డి) గండికోట రహస్యం
రవితేజకు ఓ సెంటిమెంట్ ఉంది. అతని ప్రతి సినిమాలోనూ (దాదాపుగా) ఓ వ్యక్తి కనీసం ఒక్క సీన్‌లోనైనా, ఒక్క ఫ్రేమ్‌లోనైనా కనిపిస్తారు. అతడెవరు?
ఎ) నటుడు బ్రహ్మాజీ బి) రవితేజ సై్టలిస్ట్
సి) నటుడు ‘ఫిష్’ వెంకట్
డి) రవితేజ పర్సనల్ అసిస్టెంట్ శీను
యండమూరి వీరేంద్రనాథ్ రాసిన పలు నవలలు సినిమాలుగా రూపొందాయి. అయితే... ఓ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా కథ రాశారు. ఆ సినిమా పేరేంటి?
ఎ) దొంగ మొగుడు బి) కాష్మోరా
సి) థ్రిల్లర్ డి) విక్కీ దాదా
హీరో నాగార్జున మొదటి సినిమా ‘విక్రమ్’ దర్శకుడు?
ఎ) వి. మధుసూదన రావు
బి) వీబీ రాజేంద్రప్రసాద్
సి) క్రాంతికుమార్
డి) దాసరి నారాయణరావు
కె. బాలచందర్ దర్శకత్వం వహించిన చివరి సినిమాలో హీరో?
ఎ) మాధవన్ బి) ప్రకాశ్‌రాజ్
సి) ఉదయ్‌కిరణ్
డి) ప్రభు
జూనియర్ ఎన్టీఆర్ సరసన ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్?
ఎ) కాజల్ అగర్వాల్
బి) జెనీలియా సి) సమంత
డి) సమీరారెడ్డి
సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ దర్శకునిగా పరిచయమైన సినిమా?
ఎ) ఒకరికి ఒకరు బి) భగీరథ
సి) సంగమం
డి) గులాబీ
ప్రకాశ్‌రాజ్‌కు నేషనల్ అవార్డు తీసుకొచ్చిన
కృష్ణవంశీ సినిమా?
ఎ) అంతఃపురం బి) ఖడ్గం
సి) శ్రీ ఆంజనేయం
డి) చక్రం
ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించిన ఏ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ ఓ పాట కంపోజ్ చేశారు?
ఎ) చిత్రం బి) ఫ్యామిలీ సర్కస్
సి) నీ కోసం
డి) నువ్వు నేను
నాగచైతన్యకు పేరు తీసుకొచ్చిన ‘ఏమాయ చేసావె’ తమిళ వెర్షన్‌లో హీరో?
ఎ) శింబు బి) ఆర్య
సి) కార్తీ డి) భరత్
పవన్‌కల్యాణ్ మొదటి భార్య పేరు?
ఎ) రేణూ దేశాయ్ బి) నళిని
సి) నందిని
డి) నీలవేణి
దర్శకుడు పూరి జగన్నాథ్ ఎక్కువ సినిమాలు తీసింది హీరో రవితేజతోనే. ఇద్దరి కాంబినేషన్‌లో ఎన్ని సినిమాలొచ్చాయి?
ఎ) నాలుగు బి) ఐదు
సి) ఆరు డి) ఏడు
హీరోయిన్ స్నేహ అసలు పేరేంటి?
ఎ) రాధిక బి) సుహాసిని
సి) రాధ డి) సుజాత
‘కళ్ల కింద క్యారీ బ్యాగులు...’ అనే డైలాగ్ ఏ కమెడియన్‌ని ఉద్దేశించి చెప్పినది?
ఎ) బ్రహ్మానందం
బి) కొండవలస సి) సుత్తివేలు
డి) ఎమ్మెస్ నారాయణ
హీరోయిన్ కాకముందు అనుష్క యోగా టీచర్ అనే సంగతి తెలిసిందే. అంతకు ముందు ఆమె స్కూల్‌లో పిల్లలకు పాఠాలు కూడా చెప్పారు. అనుష్క ఏ తరగతి టీచర్‌గా పని చేశారు?
ఎ) రెండో తరగతి బి) మూడో తరగతి
సి) నాలుగో తరగతి డి) ఐదో తరగతి