పాత లుక్లో జూనియర్ | NTR Look In Janata Garage | Sakshi
Sakshi News home page

పాత లుక్లో జూనియర్

Published Tue, Mar 29 2016 7:36 PM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM

పాత లుక్లో జూనియర్

పాత లుక్లో జూనియర్

గత కొద్ది రోజులుగా తన లుక్ విషయంలో ప్రయోగాలు చేస్తున్న ఎన్టీఆర్, ప్రస్తుతం చేస్తున్న జనతా గ్యారేజ్ విషయంలో మాత్రం ఎలాంటి ప్రయోగం చేయటం లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా ఉంగరాల జుట్టుతో, వత్తయిన గెడ్డంతో కనిపించిన జూనియర్, కొన్ని సినిమాల్లో మాత్రం డిఫరెంట్ లుక్ని ట్రై చేశాడు. ముఖ్యంగా ఇటీవల కాలం ప్రతి సినిమాకు భారీ వేరియేషన్ చూపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. బాద్ షా సినిమాలో స్ట్రయిట్నింగ్ చేయించిన హెయిర్ స్టయిల్తో స్టైలిష్గా కనిపించిన జూనియర్ క్లాస్ ఆడియన్స్ను మెప్పించాడు.

ఆ తరువాత టెంపర్ సినిమా కోసం మరోసారి ప్రయోగం చేశాడు. ఈ సినిమాలో పోలీస్ హెయిర్ కట్తో రఫ్ లుక్లో కనిపించిన జూనియర్ భారీ సక్సెస్ను నమోదు చేశాడు. అదే జోరులో నాన్నకు ప్రేమతో సినిమాలో కూడా కొత్త అవతారంలో కనిపించాడు. పూర్తి వెస్ట్రన్ లుక్లో కనిపించి మెప్పించాడు. అయితే ఇలా వరుసగా తన ప్రతీ సినిమాకు లుక్ మారుస్తూ వచ్చిన జూనియర్ నెక్ట్స్ సినిమా విషయంలో మాత్రం పాత లుక్లోనే కనిపిస్తున్నాడు.

సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమా కోసం ఎలాంటి ప్రయోగాలకు పోవటం లేదు. మాస్ కమర్షియల్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పాత లుక్లోనే కనిపిస్తున్నాడు. ఇటీవల ముంబైలో జరిగిన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ సందర్భంగా ఎన్టీఆర్ దిగిన ఫోటోతో ఈ విషయం పై క్లారిటీ వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement