
మత్స్యకారుల జీవితం గురించి తెలుసుకునే పని మీద నాగచైతన్య శ్రీకాకుళం, వైజాగ్ వెళ్లిన విషయం తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు ఓ సినిమా నిర్మించనున్నారు. మత్స్యకారుల జీవితం నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది.
ఈ సినిమా కోసమే టీమ్ కసరత్తులు చేస్తోంది. గురువారం శ్రీకాకుళంలోని మత్స్యకారులను స్వయంగా కలిసి, వారి సంస్కృతి, జీవనశైలిని అడిగి తెలుసుకున్నారు చైతన్య, చందు, ‘బన్నీ’ వాసు. శుక్రవారం వైజాగ్ పోర్టును సందర్శించారు. మత్స్యకారులతో కలసి చేపల వేటకు వెళ్లారు. సముద్ర ప్రయాణం, వేట, అక్కడ ఎదురయ్యే పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment