వైజాగ్‌కు వెంకీమామ | Venky mama movie shooting in vizag | Sakshi
Sakshi News home page

వైజాగ్‌కు వెంకీమామ

Published Sun, Jun 30 2019 12:06 AM | Last Updated on Sun, Jun 30 2019 12:06 AM

Venky mama movie shooting in vizag - Sakshi

నాగచైతన్య, వెంకటేశ్‌

సముద్ర తీర ప్రాంతమైన వైజాగ్‌కు హాయ్‌ చెప్పారు ‘వెంకీమామ’ అండ్‌ టీమ్‌. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ‘వెంకీమామ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్‌ ఇటీవల కాశ్మీర్‌లో జరిగింది. తదుపరి షెడ్యూల్‌ వైజాగ్‌లో జరగనున్నట్లు తెలిసింది. ఆల్రెడీ రాశీఖన్నా వైజాగ్‌లో ఉన్నారని సమాచారం. దీన్నిబట్టి.. ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను టీమ్‌ ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తారు. డి. సురేశ్‌ బాబు, టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్‌ స్వరకర్త.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement