పడవ బోల్తా | ship accidant | Sakshi
Sakshi News home page

పడవ బోల్తా

Published Tue, Oct 4 2016 9:54 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

ship accidant

నరసాపురం రూరల్‌ : సముద్రంలో చేపల వేటకు వెళ్లిన  మర పడవ  ప్రమాదవశాత్తు అలల ఉధృతికి  బోల్తా కొట్టింది. నరసాపురం మండలం వేములదీవి శివారు చినమైనవానిలంక గ్రామానికి చెందిన మైల లవరాజు, మరో ముగ్గురితో కలిసి మంగళవారం తెల్లవారు జామున సముద్రంలో వేటకు వెళ్లాడు. అలల తాకిడికి పడవ బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. పడవ తిరగబడడంతో వేట సామగ్రితోపాటు ఇంజిన్‌ పాడైంది. పడవ దెబ్బతింది. వలల చిరిగిపోయాయి.  ఆస్తి నష్టం రూ.లక్ష ఉంటుంది. దీంతో మత్స్యకారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు మత్స్యశాఖ అధికారి రమణకుమార్‌ తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement