గాలానికి చెక్కిన చేపతో కోయ్ ప్రైజ్
న్యూయార్క్ : టేనస్సీకి చెందిన కోయ్ ప్రైజ్ కొద్దిరోజుల క్రితం ఫ్యామిలీతో కలిసి చేపలు పట్టడానికి స్పెన్సర్ క్రీక్‌కు వెళ్లాడు. అక్కడి ఓల్డ్ హైకోరీ సరస్సులో కుటుంబసభ్యులందరూ చాకచక్యంగా చేపలు పడుతూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కోయ్ సహోదరిలు కూడా అతడి కంటే పెద్దపెద్ద చేపలు పడుతున్నారు. దీంతో అతడి మనసు కొద్దిగా చివుక్కుమంది. ఎలాగైనా వారికంటే పెద్ద చేపను పట్టాలని, దేవుడ్ని మొక్కి మరీ గాలాన్ని సరస్సులో వేశాడు. కొద్దిసేపటి తర్వాత ఏదో చేప గాలానికి చిక్కుకున్నట్లు తెలిసింది. పైకి ఎంత లాగుతున్నా కానీ, అది రావటం లేదు. కుటుంబసభ్యుల సహాయంతో గట్టిగా లాగగా పెద్ద చేప బయటపడింది. 35 కేజీలు, దాదాపు కోయ్ అంత పొడవు ఉందా చేప. పిల్లాడి ఆనందం, ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి. ( సూర్యుడు కూడా ‘లాక్‌డౌన్’! )
చేపను నీళ్లలో వదిలేసిన దృశ్యం
తను కల్లో కూడా ఊహించని ఘటన జరిగేసరికి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. దానితో ఫొటోలు దిగి, మళ్లీ నీళ్లలోనే వదిలేశాడు. టేనస్సీ వైల్డ్ లైఫ్ రీసోర్స్ ఏజెన్సీ ఈ సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని తమ ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో కోయ్ సోషల్ మీడియా ఫేమస్ అయిపోయాడు. నెటిజన్లందరూ అతడ్ని శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. ( అడవి కుక్క వింత శబ్దం.. భయపడిన పులి )
Comments
Please login to add a commentAdd a comment